National Film Awards 2023 : జాతీయ అవార్డ్స్ లో సత్తా చాటుతున్న తెలుగు సినీ ఇండస్ట్రీ….

National Film Awards 2023 : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ 69వ జాతీయ పురస్కారాలలో తెలుగు నటులు మరియు టెక్నీషియన్స్ సత్తా చాటుకున్నారు. సంగీతం సాహిత్యం , డాన్స్ , యాక్టింగ్ ,ఫైట్స్, దర్శకత్వం, నిర్మాణం వంటి , పలు రంగాలలో తెలుగు పరిశ్రమ అవార్డును అందుకొని తెలుగు జాతి ఖ్యాతిని పెంచింది. అంతేకాక ఇంతవరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో […]

  • Published On:
National Film Awards 2023 : జాతీయ అవార్డ్స్ లో సత్తా చాటుతున్న తెలుగు సినీ ఇండస్ట్రీ….

National Film Awards 2023 : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ 69వ జాతీయ పురస్కారాలలో తెలుగు నటులు మరియు టెక్నీషియన్స్ సత్తా చాటుకున్నారు. సంగీతం సాహిత్యం , డాన్స్ , యాక్టింగ్ ,ఫైట్స్, దర్శకత్వం, నిర్మాణం వంటి , పలు రంగాలలో తెలుగు పరిశ్రమ అవార్డును అందుకొని తెలుగు జాతి ఖ్యాతిని పెంచింది. అంతేకాక ఇంతవరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరు పొందని ఉత్తమ నటుడు అవార్డుని అల్లు అర్జున్ గెలుచుకోవడం అందర్నీ సంతోషింప చేస్తుంది. అయితే ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఇక దీనిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.

ఈ క్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ..ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ( పుష్ప ) , కీరవాణి (ఆర్ఆర్ఆర్ ) అలాగే ఉత్తమ గాయకుడిగా కాలభైరవ ( కొమురం బీముడో సాంగ్ ) ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ ( ఆర్ఆర్ఆర్) ఉత్తమ పాపులర్ సినిమాగా ( ఆర్ఆర్ఆర్ ) ,ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ శ్రీనివాస్ మోహన్ ( ఆర్ఆర్ఆర్) ఉత్తమ లిరిక్ రైటర్ గా చంద్రబోస్ ( కొండపొలం ), ఉత్తమ స్టంట్ మాస్టర్ గా కింగ్ సోలేమాన్ (ఆర్ఆర్ఆర్) , ఉత్తమ సినిమాగా ఉప్పెన జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నాయి. దీంతో ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వించదగిన సన్నివేశంగా దీనిని పేర్కొంటున్నారు. మునిపెన్నడూ లేని విధంగా జాతీయ సినీ అవార్డ్స్ లో తెలుగు సినీ ఇండస్ట్రీ సత్తా చాటడంతో ప్రతి ఒక్కరు ఎంతగానో ఆనందిస్తున్నారు.