Nandamuri Balakrishna : బాలకృష్ణ పై తమిళ్ నటి కాస్టింగ్ కౌచ్ ఆరోపణ…

Nandamuri Balakrishna : 2001లో నందమూరి బాలకృష్ణ “బలే వాడివి బాసు” అనే సినిమాలో నటించడం జరిగింది. అయితే ఈ సినిమాకు తమ్ముడు సినిమతో సూపర్ హిట్ అందుకున్న అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మ్యూజిక్ బ్యానర్ పై శివలింగ కృష్ణ ప్రసాదు ఈ సినిమాను నిర్మించడం జరిగింది. అయితే నరసింహ నాయుడు వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే అసలు […]

  • Published On:
Nandamuri Balakrishna : బాలకృష్ణ పై తమిళ్ నటి కాస్టింగ్ కౌచ్ ఆరోపణ…

Nandamuri Balakrishna : 2001లో నందమూరి బాలకృష్ణ “బలే వాడివి బాసు” అనే సినిమాలో నటించడం జరిగింది. అయితే ఈ సినిమాకు తమ్ముడు సినిమతో సూపర్ హిట్ అందుకున్న అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మ్యూజిక్ బ్యానర్ పై శివలింగ కృష్ణ ప్రసాదు ఈ సినిమాను నిర్మించడం జరిగింది. అయితే నరసింహ నాయుడు వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే అసలు ఈ సినిమా డిస్కషన్ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే డౌట్ మీకు రావచ్చు…అయితే ఈ సినిమాలో విచిత్ర అనే ఓ తమిళ నటి నటించడం జరిగింది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను ఆమె బయట పెట్టడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

tamil-actress-casting-couch-allegation-on-balakrishna

అయితే తమిళ్ నటి తాజాగా సినిమా షూటింగ్ విషయాల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా తమిళ్ బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె టాస్క్ లో భాగంగా భలేవాడివి బాసు అనే సినిమా షూటింగ్ అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే నటి విచిత్ర మాట్లాడుతూ…2001లో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను. దీనిలో భాగంగా కేరళలోని అవుట్ డోర్ లో షూటింగ్ నిర్వహించారు. మూడు స్టార్ హోటల్లో మాకు రూమ్ ఇవ్వడం జరిగింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకరోజు పార్టీ కూడా జరిగింది. ఇక ఆ పార్టీకి వెళ్ళినప్పుడు సినిమాలోని మెయిన్ హీరో నన్ను కలవడం జరిగింది. అయితే ఆయన నన్ను కలిసి కనీసం నా పేరు కూడా అడగకుండా రాత్రికి నా రూమ్ కి వచ్చేయి అంటూ అనేశాడు…

tamil-actress-casting-couch-allegation-on-balakrishna

కానీ నేను అతని రూమ్ కి పోకుండా నేరుగా నా రూమ్ కి వెళ్ళిపోయాను. నేను అలా చేయడంతో ఆ అగ్ర హీరో రోజు నన్ను వేధించేవాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం ఆమె చెప్పినట్లుగా అనిపించడం లేదు. కాని ఆమె హీరో పేరు చెప్పినప్పటికీ ఆ వీడియోను తర్వాత మ్యూట్ చేశారని నేటిజనులు భావిస్తున్నారు . దీంతో బాలకృష్ణ పై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా వీడియోని షేర్ చేస్తూ జాన్విక్ అనే వ్యక్తి బాలకృష్ణ గురించి నెగెటివ్ గా రాసుకోవచ్చారు. అయితే ఆ వీడియోలో ఆమె మాట్లాడింది కచ్చితంగా బాలకృష్ణ గురించి అనేది మాత్రం క్లారిటీగా తెలియదు. ఇక ఇలాంటి విషయాలను బాలయ్య కూడా ఎక్కువగా పట్టించుకోరు అని అందరికీ తెలుసు. మరి దీనిపై బాలకృష్ణ స్పందిస్తారో లేదో వేచి చూడాలి.