Tamannaah : డబ్బుకు ఆశపడి గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకున్న తమన్నా…ఛాన్స్ కొట్టేసిన అనసూయ…

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఓవైపు సినిమాల్లో ,వెబ్ సిరీస్ లో నటిస్తూనే మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా ఐటెం సాంగ్స్ తో అందర్నీ అలరిస్తుంది. అంతేకాక ఇంతకు మునుపే రెండు మూడు సినిమాల్లో ఈ బ్యూటీ స్పెసల్ సాంగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరో మూవీలో ఐటమ్ సాంగ్ లో నటించేందుకు తమన్నాకు అవకాశం లభించింది. […]

  • Published On:
Tamannaah : డబ్బుకు ఆశపడి గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకున్న తమన్నా…ఛాన్స్ కొట్టేసిన అనసూయ…

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఓవైపు సినిమాల్లో ,వెబ్ సిరీస్ లో నటిస్తూనే మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా ఐటెం సాంగ్స్ తో అందర్నీ అలరిస్తుంది. అంతేకాక ఇంతకు మునుపే రెండు మూడు సినిమాల్లో ఈ బ్యూటీ స్పెసల్ సాంగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరో మూవీలో ఐటమ్ సాంగ్ లో నటించేందుకు తమన్నాకు అవకాశం లభించింది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు నటసింహ నందమూరి బాలయ్య.

Tamanna missed the golden offer... Anasuya get the chance...

అయితే అఖండ , వీరసింహారెడ్డి వంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ ను సొంతం చేసుకున్న తర్వాత ,బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాను చేస్తున్నారు. ఎన్.బి.కె 108 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా…తెలుగు ఇండస్ట్రీ గోల్డెన్ లెగ్ బ్యూటీ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కీలక పాత్రలో నటించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు.

Tamanna missed the golden offer... Anasuya get the chance...

 

అయితే ఈ సినిమాలో ఓ మంచి మసాలా ఐటమ్ సాంగ్ ఉండడంతో, ఈ సాంగ్లో చేసేందుకు మూవీ మేకర్స్ తమన్నాను సంప్రదించారట. ఐటెం సాంగ్ లో బాలయ్యతో ఆడి పాడెందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా..దానికోసం ఏకంగా 1.5 కోట్ల రెమ్యూనికేషన్ డిమాండ్ చేసిందట. దానికి ఒక్క రూపాయి తగ్గిన చేసే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పిందట. అయితే సాధారణంగా సినిమాకే హీరోయిన్లు 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాంటిది మూడు ,నాలుగు నిమిషాల ఐటెం సాంగ్ కు తమన్నా భారీగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాక్ అయ్యారు.

Tamanna missed the golden offer... Anasuya get the chance...

ఈ నేపథ్యంలో తమన్నాకు బదులుగా బుల్లితెర యాంకర్ అనసూయ ను తీసుకోవాలని మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే అనసూయ కూడా ఇదివరకే పలు ఐటెం సాంగ్స్ లో నటించి బాగా ఆకట్టుకుంది. అంతేకాక ప్రస్తుతం ఆమెకు క్రేజ్ కూడా విపరీతంగా ఉంది. దీంతో బాలయ్య సినిమాలో అనసూయను ఐటెం భామగా కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావ్ తమన్నా అంటూ ఆమెను విమర్శిస్తున్నారు. డబ్బుకు ఆశపడి గోల్డెన్ ఆఫర్ ను మిస్ చేసుకుంన్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు.