Surya – Jyothika : సూర్య – జ్యోతిక విడాకులు…..క్లారిటీ ఇచ్చిన కార్తి….

Surya – Jyothika  : కోలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన జంటలలో సూర్య జ్యోతిక ఒకరు.వారి అభిమానులు కూడా వారిని అన్న, వదిన అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అయితే గత కొద్దిరోజుల నుండి సూర్య జ్యోతికలు విడిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ప్రస్తుతం జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్నట్టు సమాచారం. దీంతో సూర్య ముంబై నుండి చెన్నైకు ట్రావెల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సూర్య మరియు జ్యోతిక 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. […]

  • Published On:
Surya – Jyothika  : సూర్య – జ్యోతిక విడాకులు…..క్లారిటీ ఇచ్చిన కార్తి….

Surya – Jyothika  : కోలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన జంటలలో సూర్య జ్యోతిక ఒకరు.వారి అభిమానులు కూడా వారిని అన్న, వదిన అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అయితే గత కొద్దిరోజుల నుండి సూర్య జ్యోతికలు విడిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ప్రస్తుతం జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్నట్టు సమాచారం. దీంతో సూర్య ముంబై నుండి చెన్నైకు ట్రావెల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సూర్య మరియు జ్యోతిక 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అప్పుడు హీరోయిన్ గా జ్యోతిక మంచి ఫామ్ లో ఉంది. అయితే వీరిద్దరి పెళ్లి సూర్య తండ్రి శివకుమార్ కు మొదటి నుండే ఇష్టం లేదట.కానీ కొడుకు ఇష్టాన్ని కాదని లేక వీరికి వివాహం జరిపించాడు. అంతేకాక ఈ వివాహానికి శివకుమార్ కండిషన్ కూడా పెట్టారట.

surya-jyothikas-divorce-karthi-gives-clarity

పెళ్లి తర్వాత జ్యోతికని సినిమాలు చేయకూడదని శివ కుమార్ కండిషన్ పెట్టడం జరిగింది. అందుకే జ్యోతిక వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. అయితే ఇప్పుడు మరలా తిరిగి జ్యోతిక సినిమాల్లో కనిపిస్తుండడంతో తన మామ శివకుమార్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో వారి మధ్య విభేదాలు వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్య కూడా జ్యోతికకే సహకరించాడట.ఇక ఈ విషయం సూర్య తండ్రికి నచ్చకపోవడంతో మరిన్ని విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్తమామలకు దూరంగా ఉండాలని జ్యోతిక తన పిల్లలను తీసుకొని ముంబైలో ఉంటుంది. ఈ నేపథ్యంలో సూర్య ముంబై టు చెన్నై ,తిరుగుతున్నట్లుగా సమాచారం. ఇది ఇలా ఉండగా మరోవైపు సూర్య పిల్లలు పెద్దవాళ్లు అవడంతో పై చదువుల కోసం ముంబై వెళ్ళినట్లుగా కొందరు తెలుపుతున్నారు.

surya-jyothikas-divorce-karthi-gives-clarity

కేవలం పిల్లల చదువుకోసమే వారు చెన్నై నుండి ముంబై వెళ్లి ఉంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సూర్య కుటుంబం ఈ వార్తలపై స్పందించలేదు. దీంతో సూర్య కుటుంబ విడిపోవడానికి జ్యోతికనే కారణం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇలా వస్తున్న కామెంట్స్ పై ఇటీవల సూర్య తమ్ముడు కార్తీ అసహనం వ్యక్తం చేశారు. జ్యోతికను నేను నటిగా వదినగా ఎప్పుడు చూడలేదని ఒక తల్లిలా చూశానని, తను కూడా మమ్మల్ని తన పిల్లల లాగే చూసింది. అంతేకాక మేము ఇన్నాళ్లు కలిసి ఉండటానికి కారణం జ్యోతికనే అని కార్తీ చెప్పుకొచ్చాడు.ఇక ఇప్పుడు అమ్మ ముంబైలో ఉండడానికి గల కారణం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వారు చదువుల కోసమే ముంబై వెళ్లారు. పిల్లలు చదువు పూర్తి అయిన అనంతరం తిరిగి వస్తారని మళ్లీ మేము కలుస్తామని కార్తీ తెలియజేశారు.