Bubblegum Teaser : అర్జున్ రెడ్డిని మించిపోయిన సుమా కనకాల కొడుకు…టీజర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే…
Bubblegum Teaser : యాంకర్ సుమ కనకాల నటుడు రాజీవ్ కనకాల కుమారుడు హీరోగా పరిచయం అవుతున్న తాజా సినిమా బబుల్ గమ్. రవీకాంత్ పేరేపు దర్శకత్వ వహించిన ఈ సినిమాకు మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సినీ బృందం విడుదల చేయడం జరిగింది. ఇక దీనిలో సుమా కుమారుడు రోషన్ అదిరిపోయే లుక్ లో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. అంతేకాక అర్జున్ రెడ్డిని మించి […]
Bubblegum Teaser : యాంకర్ సుమ కనకాల నటుడు రాజీవ్ కనకాల కుమారుడు హీరోగా పరిచయం అవుతున్న తాజా సినిమా బబుల్ గమ్. రవీకాంత్ పేరేపు దర్శకత్వ వహించిన ఈ సినిమాకు మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సినీ బృందం విడుదల చేయడం జరిగింది. ఇక దీనిలో సుమా కుమారుడు రోషన్ అదిరిపోయే లుక్ లో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. అంతేకాక అర్జున్ రెడ్డిని మించి రొమాన్స్ చేస్తూ చెలరేగిపోయాడు. తల్లిదండ్రుల నటన నైపుణ్యాన్ని నేర్చుకుని యాక్టింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక సినిమా ప్రోమో స్టార్ట్ అవ్వడమే బయగాన్ లో ప్యార్ ..బబుల్ గమ్ లాంటిది. మొదటి తీయగా ఉంటుంది కానీ తర్వాత అంటుకుంటుంది. షూ కింద …థియేటర్లో సీట్ల కింద అంత ఈజీ కాదు రోయ్ అంటూ వాయిస్ ఓవర్ తో సినిమా టీజర్ మొదలైంది.
ఇక ఈ వాయిస్ ని చూసి సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఇవ్వగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకోకపోతే నాలాగా బొక్కలు కొట్టుకుంటావు అని హీరో తండ్రి డైలాగ్ అదిరిపోయింది. ఇక ఈ డైలాగ్ తర్వాత రోషన్ కనకాల చికెన్ సెంటర్ లో చికెన్ కొడుతూ కనిపిస్తాడు. అనంతరం ఓ పబ్ లో డీజే గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడు. ఇక అదే పబ్ లో హీరోయిన్ ని చూడడం , ఆమె అందానికి ఫీదా అవ్వడం , ఆ తర్వాత వారి పరిచయం ప్రేమ ,హీరోయిన్ కు రోషన్ ప్రపోజ్ చేసేటప్పుడు చెప్పే డైలాగ్ ఓవరాల్ గా టీజర్ అదిరిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ పుట్టినరోజుకు వెళ్లలేకపోయిన రోషన్ గిఫ్ట్ ఇచ్చేందుకు డబ్బు లేక అవస్థ పడినట్లుగా కనిపిస్తుంది.
ఇక చివర్ లో బీచ్ ఒడ్డున హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ అయితే అర్జున్ రెడ్డి సినిమాను తలపిస్తుంది. అయితే రోషన్ కనకాల పాత్ర తనకి చాలా బాగా సెట్ అయింది. ఇక నటనపరంగా కూడా రోషన్ ఇరగదీశాడు. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ , మరియు మహేశ్వరి మూవీస్ కలిసి నిర్మించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇటీవల దర్శకుడు రాజమౌళి విడుదల చేయడం జరిగింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆ పోస్టర్ లో కూడా హీరో హీరోహిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కనిపించింది. దీంతో ప్రస్తుతం యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఈ సినిమా వస్తున్నట్లు అర్థం అవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి ప్రయోజనం అందుకుంటున్న వేచి చూడాలి.