Sudigali Sudheer : పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుదీర్…
Sudigali Sudheer : బుల్లితెర మోస్ట్ పాపులర్ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది హాస్యనటులు వెండితెరకు పరిచయమయ్యారు. అయితే వీరందరిలో సుడిగాలి సుదీర్ మాత్రం ఏకంగా వెండితెర హీరోగా దర్శనమిచ్చాడు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సుధీర్ హీరో స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ సుదీర్ అనే సినిమాతో వెండితెరపై హీరోగా కనిపించిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత గాలోడు వంటి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా […]
Sudigali Sudheer : బుల్లితెర మోస్ట్ పాపులర్ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది హాస్యనటులు వెండితెరకు పరిచయమయ్యారు. అయితే వీరందరిలో సుడిగాలి సుదీర్ మాత్రం ఏకంగా వెండితెర హీరోగా దర్శనమిచ్చాడు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సుధీర్ హీరో స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ సుదీర్ అనే సినిమాతో వెండితెరపై హీరోగా కనిపించిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత గాలోడు వంటి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బుల్లితెరకు విరామం చెప్పి వెండితెరపై ఫోకస్ చేసిన సుధీర్ తాజాగా “కాలింగ్ సహస్ర “అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహించగా, హీరోయిన్ గా డాలీషా నటించడం జరిగింది.
ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సుడిగాలి సుదీర్ సమాధానం చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే రిపోర్టర్ రష్మీ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగ్గా…నేను అసలు పెళ్లి చేసుకోను ప్రస్తుతం నాకు కెరియర్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అంటూ , భవిష్యత్తులో చేసుకుంటే చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రేక్షకులను అలరించడానికి మాత్రమే రష్మితో అలా చేశానని అంతేకానీ మా మధ్య అలాంటిదేం లేదంటూ సుదీర్ క్లారిటీ ఇచ్చాడు.
అనంతరం రష్మీ హీరోయిన్ గా మీరు ఎప్పుడు సినిమా చేస్తారని ఓ రిపోర్టర్ అడుగగా… ప్రస్తుతం నేను రష్మి కథలు వింటున్నాం మా ఇద్దరికీ కామన్ గా ఒక కథ కూడా నచ్చడం లేదు.. అలాంటి కథ దొరికినప్పుడు ఖచ్చితంగా నటిస్తామంటూ సుడిగాలి సుదీర్ చెప్పుకొచ్చారు. ఇక కాలింగ్ సహస్ర సినిమా గురించి మాట్లాడుతూ ఈరోజుల్లో ఒక సినిమా హిట్ అవ్వాలంటే దాని వెనక బలమైన కారణం కథ. సినిమా కథ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మీ ముందుకు తీసుకువచ్చామని ఈ సినిమా చూసినవారు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారంటూ సుధీర్ చెప్పుకొచ్చాడు.