Sudigali Sudeer : అందర్నీ కాదని సుడిగాలి సుధీర్ కు ఓకే చెప్పిన స్టార్ హీరోయిన్…గాలోడి లక్ మామూలుగా లేదుగా…

Sudigali Sudeer  : జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ తర్వాత వివిధ టీవీ షోలలో కనిపించి బిగ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వెండితెరపై కూడా అడుగుపెట్టాడు. బుల్లితెరపై అంతటి స్టార్ ఇమేజ్ కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది సుడిగాలి సుదీర్ అనే చెప్పాలి. అయితే మొదట సుధీర్ చిన్న చిన్న పాత్రలలో క్యారెక్టర్ […]

  • Published On:
Sudigali Sudeer : అందర్నీ కాదని సుడిగాలి సుధీర్ కు ఓకే చెప్పిన స్టార్ హీరోయిన్…గాలోడి లక్ మామూలుగా లేదుగా…

Sudigali Sudeer  : జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ తర్వాత వివిధ టీవీ షోలలో కనిపించి బిగ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వెండితెరపై కూడా అడుగుపెట్టాడు. బుల్లితెరపై అంతటి స్టార్ ఇమేజ్ కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది సుడిగాలి సుదీర్ అనే చెప్పాలి. అయితే మొదట సుధీర్ చిన్న చిన్న పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత హీరోగా ప్రమోషన్ కొట్టేశాడు. “సాఫ్ట్ వేర్ సుధీర్ ” సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన సుడిగాలి సుదీర్

sudigali-sudheer-new-movie-update

 

ఆ తర్వాత “త్రీ మంకీస్” “వాంటెడ్” “పండుగాడు” వంటి సినిమాలను చేశాడు . ఇక ఇవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ సుధీర్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇలాంటి తరుణంలో మరల గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుదీర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని కైవసం చేసుకుని ప్రొడ్యూసర్ కు కనక వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా రిజల్ట్ చూశాక సుదీర్స్ తో మరల సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను తీసిన దశరథ్… సుధీర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడని ప్రచారం వినబడుతుంది. ఇది ఇలా కొనసాగుతుండగా సుధీర్ తన 4వ సినిమాని ప్రారంభించేశాడు.

sudigali-sudheer-new-movie-update

విశ్వక్ సేన్ హీరోగా నటించిన పాగల్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నరేష్ కుప్పిలి ఇప్పుడు సుడిగాలి సుదీర్ తో కలిసి ఎస్ఎస్4 వర్కింగ్ టైటిల్ తో కొత్త సినిమాని ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో సుధీర్ సరసన నయా గ్లామర్ దివ్యభారతి హీరోయిన్గా నటించబోతోంది . అయితే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు దివ్యభారతి ని హీరోయిన్గా అడుగుగా డేట్స్ ఖాళీ లేవని చెప్పిన ఆమె , సుడిగాలి సుధీర్ కి డేట్స్ ఇవ్వడం గమనార్హం. ఇదంతా చూసుకుంటే సుధీర్ ఇక బుల్లితెరకు గుడ్ బాయ్ చెప్పినట్లే అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.