Anasuya Bharadwaj : మళ్లీ ప్రెగ్నెంట్ అవ్వాలని ఉంది…అనసూయ భరద్వాజ్…

Anasuya Bharadwaj : తొలుత న్యూస్ రీడర్ గా కెరియర్ ను ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టి ఇప్పుడు వెండితెరపై ఐటమ్ గర్ల్ గా ,వదినగా, అత్తగా, విలన్ గా విభిన్నమైన పాత్రలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది అనసూయ భరద్వాజ్. అయితే మొదట జబర్దస్త్ ద్వారా ప్రజలలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో బుల్లితెరకు పులిస్టాప్ పెట్టి వెండితెరపై కనిపించడం మొదలుపెట్టింది. […]

  • Published On:
Anasuya Bharadwaj : మళ్లీ ప్రెగ్నెంట్ అవ్వాలని ఉంది…అనసూయ భరద్వాజ్…

Anasuya Bharadwaj : తొలుత న్యూస్ రీడర్ గా కెరియర్ ను ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టి ఇప్పుడు వెండితెరపై ఐటమ్ గర్ల్ గా ,వదినగా, అత్తగా, విలన్ గా విభిన్నమైన పాత్రలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది అనసూయ భరద్వాజ్. అయితే మొదట జబర్దస్త్ ద్వారా ప్రజలలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో బుల్లితెరకు పులిస్టాప్ పెట్టి వెండితెరపై కనిపించడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు ఇమెకు సినీ అవకాశాలు కూడా కాస్త తగ్గాయని చెప్పాలి.దీంతో ఇప్పుడు అనసూయకు ఫ్రీ టైం దొరకడంతో ఫ్యామిలీ ట్రిప్స్ కు బాగా వెళ్లడం జరుగుతుంది. అయితే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు.

anchor-anasuya-shocking-comments-got-viral

ఆ మధ్య భర్తతో కలిసి బికినీలో బీచ్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.  ఇక దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే అనసూయ కి త్వరగా పెళ్లి జరగడంతో ఆమె సినిమాల్లోకి వచ్చేసరికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అనసూయ ఒకవైపు భర్త పిల్లలను చూసుకుంటూనే మరోవైపు కెరియర్ పరంగా దూసుకెళ్తోంది. అయితే ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఇంటర్వ్యూలలో పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ వైరల్ గా మారుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను వైన్ తాగుతానని దానిలో తప్పేముందంటూ వెల్లడించింది. అంతేకాక చూసే వారి కళ్ళను బట్టే తప్పు కనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించింది.  ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు చేసింది.

anchor-anasuya-shocking-comments-got-viral

ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ వివరాలను చెబుతూ…తన భర్త కుటుంబం బీహార్ కు చెందినదని, అక్కడ సాంప్రదాయాలు చాలా ఎక్కువ అని తెలియజేసింది. అంతేకాక అక్కడ పదిమందిలో ఎప్పుడు కొంగు కప్పుకొని ఉండాలని , అక్కడకి వెళితే తాను కూడా అలాగే ఉంటుందని తెలిపింది. అదేవిధంగా తనకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమని నాకు ఒక ఆడపిల్లని కానాలని ఉందని తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే యాంకర్ మరి మీరు ఆడపిల్లని కంటారా అని అడిగితే నాకు కనాలనే ఉందని తెలియజేసింది. కానీ కెరియర్ పరంగా కాస్త ఇప్పుడే అడుగులు వేస్తుండడంతో తన కోరికను నెరవేర్చుకోలేకపోతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే అనసూయ భరద్వాజ్ ఇంతకుముందు కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం మనం చూసాం. ఓసారి జబర్దస్త్ లో కూడా తనకి ఆడపిల్ల లేదని నాకు ఒక ఆడపిల్ల ఉండి ఉంటే బాగుంటుందంటూ అనసూయ కామెంట్స్ చేసింది. ఇక ఇప్పుడు మరల ఇలా మాట్లాడడంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.