Hero Vishal : వివాదంలో చిక్కుకున్న స్టార్ హీరో విశాల్…రూ.15 కోట్లు చెల్లించాలంటూ కోర్టు ఆదేశం..

Hero Vishal  : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. దాదాపు 15 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందిగా కోరుతూ హై కోర్టు 3 వారాల గడువును నిర్ణయించింది. అలా చేయని తరుణంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తేరకెక్కిన సినిమాలను ఇక పై రిలీజ్ చేసేందుకు నిషేధిస్తామని తెలిపింది. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ లైక ప్రొడక్షన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో హైకోర్టు ఈ తీర్పు […]

  • Published On:
Hero Vishal : వివాదంలో చిక్కుకున్న స్టార్ హీరో విశాల్…రూ.15 కోట్లు చెల్లించాలంటూ కోర్టు ఆదేశం..

Hero Vishal  : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. దాదాపు 15 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందిగా కోరుతూ హై కోర్టు 3 వారాల గడువును నిర్ణయించింది. అలా చేయని తరుణంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తేరకెక్కిన సినిమాలను ఇక పై రిలీజ్ చేసేందుకు నిషేధిస్తామని తెలిపింది. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ లైక ప్రొడక్షన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే గతంలో విశాల్ తన నిర్మాణ సంస్థ కోసం ప్రముఖ నిర్మాత ఫైనాన్షియల్ అంగుచెలియన్ వద్ద రూ.21.29 కోట్లను అప్పుగా తీసుకున్నారట.

star-hero-vishal-who-is-caught-in-the-controversy-has-been-ordered-by-the-court-to-pay-rs-15-crores

అయితే ఈ అప్పు ను లైక ప్రొడక్షన్స్ ఫైనాన్షియరుకు తిరిగి ఇచ్చేసింది. ఈ తరుణంలో తమకు రుణం చెల్లించేంతవరకు విషయాలు నటించే సినిమాలన్నీ తమకే వచ్చేలా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ మరియు లైకా ప్రొడక్షన్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ ఒప్పందాన్ని విశాల్ ఇటీవల ఉల్లంఘిస్తూ తన సినిమా ” వీరమే వాగే సూడుం” సినిమాను రిలీజ్ చేశారు. దీంతో ఆగ్రహించిన లైక ప్రొడక్షన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి స్పెషల్ కోర్టు రిజిస్టర్ పేరుతో మూడు వారాలలోపు 15 కోట్ల రూపాయలను శాశ్వత డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది.

star-hero-vishal-who-is-caught-in-the-controversy-has-been-ordered-by-the-court-to-pay-rs-15-crores

ఇక ఈ కేసు విచారణలో భాగంగా విశాల్ నేరుగా కోర్టుకు వచ్చి లైకా సంస్థ కోర్టును ఆశ్రయించడం వలన తాను తీసుకున్న రుణాన్ని చెల్లించలేకపోయాడని, అంతేకాక తనకు ఒకేరోజు 18 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు విశాల్ ఆస్తులు వివరాలను సమర్పించాల్సిందిగా కోరింది.ఇక ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో విశాల్ అఫీలు చేసాడు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజా జస్టిస్ భరత చక్రవర్తి నేతృత్వంలో విచారణ జరిపిన హై కోర్టు విశాల్ పై సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించింది. అంతేకాక తుది తీర్పు వెలువడేంతవరకు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నుండి ఎలాంటి చిత్రాలు థియేటర్లో లేదా ఓటీటీ లలో విడుదల చేయకూడదని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.