Rajamouli : ‘ఆర్ఆర్ఆర్ ‘ సినిమాకి ఆస్కార్ అవార్డునా ..! రాజమౌళి కి అంత సీన్ లేదు.. ప్రముఖ హీరో షాకింగ్ కామెంట్స్ ..

Rajamouli  : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను పొందింది. అంతేకాకుండా ఇటీవల ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చింది. అలాగే ఈ పాట ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది. వచ్చే ఆదివారం జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ లలో ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావాలని […]

  • Published On:
Rajamouli : ‘ఆర్ఆర్ఆర్ ‘ సినిమాకి ఆస్కార్ అవార్డునా ..! రాజమౌళి కి అంత సీన్ లేదు.. ప్రముఖ హీరో షాకింగ్ కామెంట్స్ ..

Rajamouli  : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను పొందింది. అంతేకాకుండా ఇటీవల ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చింది. అలాగే ఈ పాట ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది. వచ్చే ఆదివారం జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ లలో ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావాలని దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇది కేవలం తెలుగు వాడికి మాత్రమే దక్కుతున్న గౌరవం కాదు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి దక్కాల్సిన సమయం.

అలాంటి సమయంలో అందరూ చీర్స్ చెప్పుకుంటూ పండగ చేసుకుంటున్నారు. కానీ ఒక్కడు మాత్రం రాజమౌళికి అవార్డు దక్కకూడదని కోరుకుంటున్నాడు. కన్నడ స్టార్ హీరో దర్శన్ గతంలో రాజమౌళి పై ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టాడు. ఒకానొక ఇంటర్వ్యూలో అందరూ రాజమౌళి ఏదో పెద్ద డైరెక్టర్ అంటూ బిల్డప్ ఇస్తున్నారు, కానీ ఆయన అంత పెద్ద డైరెక్టర్ ఏమీ కాదు, కేవలం ఒక డైరెక్టర్ అంతే అంటూ మాట్లాడాడు. ఆరోజు ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మా రాజమౌళిని అంటావా అంటూ టాలీవుడ్ ప్రేక్షకులు దర్శన్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.

అప్పటినుండి ఆయనకి రాజమౌళి పై మరింత పగ పెరిగిపోయింది. ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు వస్తే ఈయన అస్సలు తట్టుకోలేడు. అందుకే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రాకూడదని ఆ హీరో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు. దీంతో నెటిజన్స్ ఆ స్టార్ హీరోపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. దేశం గర్వించదగ్గ సినిమా తీసిన రాజమౌళిని అంత మాట అంటావా అని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక వచ్చే ఆదివారం ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించనున్నారు. మరి మన సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తుందో రాదో వేచి చూడాలి.