Indraja : కీర్తి సురేష్ ను మైమరిపించేలా ఇంద్రజ డాన్స్ పెర్ఫార్మెన్స్… ప్రోమో వైరల్…

Indraja  : “దసరా” సినిమాతో హీరో నాచురల్ స్టార్ నాని 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. అయితే ఈ సినిమా విజయంలో నానితోపాటు హీరోయిన్ కీర్తి సురేష్ పాత్ర కూడా చాలా ఎక్కువనే ఉంది. ఎందుకంటే దసరా సినిమాలో నాని తో పోటీపడి మరి కీర్తి నటించింది. నటన సంగతి పక్కన పెడితే పెళ్లి బరాత్ లో కీర్తి సురేష్ చేసిన ఊర మాస్ డాన్స్ ..సినిమా మొత్తంలో ఓ రేంజ్ లో నిలిచింది. దీంతో […]

  • Published On:
Indraja : కీర్తి సురేష్ ను మైమరిపించేలా ఇంద్రజ డాన్స్ పెర్ఫార్మెన్స్… ప్రోమో వైరల్…

Indraja  : “దసరా” సినిమాతో హీరో నాచురల్ స్టార్ నాని 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. అయితే ఈ సినిమా విజయంలో నానితోపాటు హీరోయిన్ కీర్తి సురేష్ పాత్ర కూడా చాలా ఎక్కువనే ఉంది. ఎందుకంటే దసరా సినిమాలో నాని తో పోటీపడి మరి కీర్తి నటించింది. నటన సంగతి పక్కన పెడితే పెళ్లి బరాత్ లో కీర్తి సురేష్ చేసిన ఊర మాస్ డాన్స్ ..సినిమా మొత్తంలో ఓ రేంజ్ లో నిలిచింది. దీంతో ఈ డాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. దీంతో ఇంస్టాగ్రామ్ లో చాలామంది ఈ మ్యూజిక్ కు డాన్స్ చేసి ఫేమస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ గోలంతా ఎందుకు అనుకుంటున్నారా. అయితే తాజాగా జబర్దస్త్ జడ్జి ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ ఈ మ్యూజిక్ కు తనదైన స్టైల్ లో డాన్స్ చేసి దుమ్ములేపింది.

sridevi-drama-company-latest-promo-indraja-did-mass-dance-in-dasara-movie-keerthi-suresh-song

అయితే దసరా సినిమాలో కీర్తి సురేష్ చేసినట్లుగా , అలాంటి చీరనే కట్టుకుని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ స్టెప్పులు వేసింది. కీర్తి సురేష్ స్టెప్పులను దించేసింది. డాన్స్ తోపాటు ఎక్స్ప్రెషన్స్ కూడా అద్భుతంగా ఇచ్చారు ఇంద్రజ. దీంతో శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ప్రోమోన్ చూసిన ఆడియన్స్ కూడా గట్టిగా కామెంట్స్ చేస్తున్నారు. డాన్స్ ఇరగదీసారు అమ్మ, ఏం ఎనర్జీ, ఈ వయసులో కూడా మీరు ఇలా డాన్స్ చేయడం సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంద్రజ గురించి మనందరికీ తెలిసిందే జబర్దస్త్,

sridevi-drama-company-latest-promo-indraja-did-mass-dance-in-dasara-movie-keerthi-suresh-song

శ్రీదేవి డ్రామా కంపెనీలో ,ఎవరైనా చేసిన పర్ఫామెన్స్ కు క్యాచీగా కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒకసారి బిగ్ బాస్ భాను పాడిన పాట కు ” నీ వాయిస్ లో చాలా డెప్త్ ఉంది” అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ ఒక్క డైలాగ్ తో ఇంద్రజ పై వచ్చిన మీమ్స్, ట్రోల్స్ అన్నీ ఇన్ని కావని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇంద్రజ చేసిన డాన్స్ కు పలువురు “మీ డ్యాన్స్ లో డెప్త్ ఉంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఎవరు ఎంత చేసినా కీర్తి సురేష్ డాన్స్ ను మాత్రం మ్యాచ్ చేయలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంద్రజ డాన్స్ ఎలా ఉందో ఇప్పుడు ఈ ప్రోమో పై ఒక లక్కేయండి.