Hero Nani : సీఎం కేసీఆర్ ఇమిటేట్ చేసిన హీరో నాని…సరికొత్తగా మూవీ ప్రమోషన్స్…

Hero Nani : శౌర్యవ్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. నాని 30వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోని “హాయ్ నాన్న” టీం తో స్పెషల్ ఇంటర్వ్యూలు అలాగే కాలేజ్ స్టూడెంట్స్ ని కలుస్తూ ఆడియన్స్ కి దగ్గరగా అయ్యే ప్రయత్నం […]

  • Published On:
Hero Nani : సీఎం కేసీఆర్ ఇమిటేట్ చేసిన హీరో నాని…సరికొత్తగా మూవీ ప్రమోషన్స్…

Hero Nani : శౌర్యవ్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. నాని 30వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోని “హాయ్ నాన్న” టీం తో స్పెషల్ ఇంటర్వ్యూలు అలాగే కాలేజ్ స్టూడెంట్స్ ని కలుస్తూ ఆడియన్స్ కి దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా నాని విభిన్నమైన ప్రమోషను చేశాడు. రాజకీయ నాయకుడిలా, ఒక పార్టీ అధ్యక్షుడుగా ఓటు కోసం ప్రచార కార్యకర్తలు ఎలా మాట్లాడుతారో ఆ విధంగా ప్రమోషన్లు మొదలుపెట్టాడు.

hero-nani-imitate-by-cm-kcr-new-movie-promotions

ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మరియు రాహుల్ కాంబినేషన్ ప్రెస్ మీట్ డైలాగ్స్ ను ఆధారంగా చేసుకొని అదిరిపోయే డైలాగ్స్ తో తన మూవీని ప్రమోట్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేశారు. హాయ్ నాన్న పేరుతో ఫన్నీగా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తూ హీరో నాని సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాడు. ఇక ఈ వీడియోలో కేసీఆర్ ప్రెస్ మీట్ లో మరియు రిపోర్టర్లతో ఎలా అయితే మాట్లాడుతారో అలా హీరో నాని మాట్లాడుతూ పంచులు వేస్తూ కెసిఆర్ ను ఇమిటేట్ చేశాడు. ప్రచార కార్యక్రమాలలో కేసీఆర్ ప్రజల గురించి మాట్లాడితే ఇక్కడ నాని తన సినిమా గురించి మాట్లాడాడు.

ఇక కేసీఆర్ మీటింగ్ అంటేనే ఏదో ఒక స్పెషల్ డైలాగ్ హైలెట్ అవుతూనే ఉంటుంది. గతంలో జరిగిన అలాంటి డైలాగ్స్ ను తీసుకొని నాని సినిమా ప్రమోట్ చేయడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ లో ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతుంది.మరి ఆ వీడియో ఏంటో మీరు కూడా ఒకసారి చూసేయండి.