Siddharth – Aditi Rao : రెండో పెళ్లికి సిద్ధమైన సిద్ధార్థ – అదితి… ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పారుగా…

Siddharth – Aditi Rao : శర్వానంద్ మరియు సిద్ధార్థ కలిసి నటించిన మహాసముద్రం సినిమాతో హీరోయిన్ అధితి రావు హైదరి మరియు సిద్ధార్థ మధ్య పరిచయం ఏర్పడింది. ఇక అప్పటినుండి కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ వీరిద్దరూ ఎప్పుడు దీని గురించి ప్రస్తావించలేదు. కనీసం ఇలా వస్తున్న వార్తలు పై స్పందించలేదు. కానీ వీరిద్దరూ చేసే పనులు మరియు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే […]

  • Published On:
Siddharth – Aditi Rao : రెండో పెళ్లికి సిద్ధమైన సిద్ధార్థ – అదితి… ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పారుగా…

Siddharth – Aditi Rao : శర్వానంద్ మరియు సిద్ధార్థ కలిసి నటించిన మహాసముద్రం సినిమాతో హీరోయిన్ అధితి రావు హైదరి మరియు సిద్ధార్థ మధ్య పరిచయం ఏర్పడింది. ఇక అప్పటినుండి కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ వీరిద్దరూ ఎప్పుడు దీని గురించి ప్రస్తావించలేదు. కనీసం ఇలా వస్తున్న వార్తలు పై స్పందించలేదు. కానీ వీరిద్దరూ చేసే పనులు మరియు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు మాత్రం నిజంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా చెప్పకనే చెప్పాయి. మరి ముఖ్యంగా మహాసముద్రం సినిమాలో నటించిన హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు వీరిద్దరూ కలిసి జంటగా రావడం అందర్నీ ఆకట్టుకుంది.  దీంతో త్వరలోనే వీరిద్దరు కూడా పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి.

siddharth-and-aditi-who-are-ready-for-their-second-marriage

అయితే అందరికీ ఎలాగో తెలిసిపోయింది కదా అనే ఉద్దేశంతో ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఓపెన్ గానే తిరిగేస్తున్నారు. అలాగే వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలకు వీడియోలకు అసలు ఏమాత్రం కండిషన్లు కూడా ఉండడం లేదు. అయితే ఇటీవల సిద్ధార్థ చిన్నా అనే సినిమా తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బాలీవుడ్ ప్రీమియర్ కి అదితి దగ్గరుండి అన్ని పనులను చూసుకుంది. అంతేకాక పుట్టినరోజులకు ఏదైనా స్పెషల్ డేస్ కి ఒకరికొకరు సోషల్ మీడియాలో స్పెషల్ విషెస్ చెప్పుకుంటున్నారు. దీంతో వీరిద్దరూ అధికారికంగా ప్రకటించకపోయిన కచ్చితంగా రిలేషన్ లో ఉన్నారని అందరికీ క్లారిటీ వచ్చింది. ఇది ఇలా ఉండగా తాజాగా న్యూ ఇయర్ కి ఇద్దరు కలిసి విదేశాల్లో చాలా క్లోజ్ గా దిగిన ఫోటోలను అదితి రావు హైదరి షేర్ చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో వీరిద్దరూ అధికారికంగా ప్రకటించకపోయిన కలిసి దిగిన ఫోటోలు పోస్ట్ చేయడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఆ పోస్ట్ కింద అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లయితే వీరిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఇక గతంలో సిద్ధార్థ మేఘన నారాయణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా కొన్ని అనివార్య కారణాల వలన విడాకులు తీసుకున్నారు. అలాగే సిద్ధార్థ శృతిహాసన్ మరియు సమంతని కూడా ప్రేమించినట్లుగా వార్తలు వచ్చాయి. మరోపక్క అదితి కూడా సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తర్వాతకు విడాకులు తీసుకుంది. మరి వీరిద్దరూ రెండో పెళ్లికి సిద్ధమవుతారా.. ?లేక వారి డేటింగ్ ఇలాగే కంటిన్యూ చేస్తారా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)