Sarath Babu : టాలీవుడ్ లో మరో దారుణం…సీనియర్ నటుడు మృతితో మూగబోయిన సినీ ఇండస్ట్రీ…

Sarath Babu  : గత కొన్ని రోజులు గా అనారోగ్యంతో బాధపడుతున్న్న సీనియర్ నటుడు శరత్ బాబు చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న శరత్ బాబును బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే శరీరంలో ఇన్ఫెక్షన్ విపరీతంగా పెరగడంతో ప్రధాన అవయవాలైన ఊపిరితిత్తులు ,కాలేము , కిడ్నీలు వంటి , అవయవాలు ప్రభావితమైనట్లు వైద్యులు గమనించారు. […]

  • Published On:
Sarath Babu : టాలీవుడ్ లో మరో దారుణం…సీనియర్ నటుడు మృతితో మూగబోయిన సినీ ఇండస్ట్రీ…

Sarath Babu  : గత కొన్ని రోజులు గా అనారోగ్యంతో బాధపడుతున్న్న సీనియర్ నటుడు శరత్ బాబు చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న శరత్ బాబును బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే శరీరంలో ఇన్ఫెక్షన్ విపరీతంగా పెరగడంతో ప్రధాన అవయవాలైన ఊపిరితిత్తులు ,కాలేము , కిడ్నీలు వంటి , అవయవాలు ప్రభావితమైనట్లు వైద్యులు గమనించారు. ఇక వారు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సోమవారం రోజున ఆయన కన్నుమూశారు. శరత్ బాబు మరణ వార్త తెలిసిన సినీ ఇండస్ట్రీ మరియు రాజకీయ ప్రముఖులు శరత్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూ, సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అయితే శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు..ఈయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస. శరత్ బాబు తల్లిదండ్రులకు ఆయనతో కలిపి పదిమంది సంతానం.

seniour-actor-sarath-babu-passed-away

అయితే శరత్ బాబుకు అగ్ర నటులైన శివాజీ గణేషన్ , కమల్ హాసన్, రజినీకాంత్ ,చిరంజీవి సాయి కుమార్, వంటి వారితో మంచి అనుబంధం ఉంది. అయితే శరత్ బాబు 1973 వ సంవత్సరంలో “రామరాజ్యం” అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే శరత్ బాబు సినీ రంగ ప్రవేశం చేసిన కొన్నాళ్ల తర్వాత వయసులో తన కన్నా పెద్దదైన నటి రామప్రభ తో కొన్నాళ్లపాటు కాపురం చేశారు. కానీ రమ ప్రభను పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక ఆ తర్వాత తమిళనాడులోని ప్రముఖ నటుడైన నంబియార్ కూతురు స్నేహలత ను 1990లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 20 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశాక 2011లో విడాకులు తీసుకున్నారు. అయితే 200 పైగా సినిమాలలో నటించిన శరత్ బాబు…ఇప్పటికీ పలు సినిమాలలో కనిపిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు హీరోగా చేస్తూనే విలన్ గా కూడా రాణించారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. ఇలా చూసుకుంటే దాదాపు 300 సినిమాలకు పైగా శరత్ బాబు నటించి ఉంటారు.

seniour-actor-sarath-babu-passed-away

అయితే శరత్ బాబు కే బాలచందర్ డైరెక్షన్ లో ‘నిజమగిరదు” అనే తమిళ్ సినిమా ద్వారా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మరోచరిత్ర , ఇది కథ కాదు, తాయరమ్మ , బంగారయ్య, మూడుముళ్ల బంధం, అయ్యప్ప మహత్యం , శరణం అయ్యప్ప, సీతాకోకచిలుక, సంసారం ఒక చదరంగం, శ్రీరామదాసు , మగధీర తదితర సినిమాల్లో నటించి మెప్పించారు. చివరగా పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించగా, తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ నటిస్తున్న మళ్లీ పెళ్లి సినిమాలో కీలక పాత్రలో ఆయన కనిపించనున్నారు. వెండి తెరతో పాటు బుల్లితెరపై కూడా కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. అంతేకాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా శరత్ బాబు మూడు నంది అవార్డులను కూడా అందుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా జరుగుతున్న మరణాల తో మరోసారి తెలుగు నాడ మూగబోయింది. ఈ మరణ వార్త తెలుసుకున్న ప్రతి ఒక్కరూ శరత్ బాబుకు నివాళులర్పిస్తున్నారు.