Samantha Ruth Prabhu : సమంత మాక్స్ రిపోర్ట్ చూశారా…గణితంలో 100… వామ్మో దేనిలోనూ తక్కువ కాదుగా…

Samantha Ruth Prabhu :సెలబ్రిటీలకు చదువు అబ్బదని వాళ్లు స్కూల్ లేదా కాలేజీలు మధ్యలో డ్రాప్ చేసి సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారని అపోహ ప్రచారంలో ఉంది. అయితే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో కూడా చదువులో గొప్పగా రాణించిన వారు చాలామంది ఉన్నారు అన్న సంగతి ఎవరికి తెలియదు. అలాంటి వారిలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంగ్లీష్ లిటరేచర్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. హీరోయిన్ సాయి పల్లవి కూడా […]

  • Published On:
Samantha Ruth Prabhu : సమంత మాక్స్ రిపోర్ట్ చూశారా…గణితంలో 100… వామ్మో దేనిలోనూ తక్కువ కాదుగా…

Samantha Ruth Prabhu :సెలబ్రిటీలకు చదువు అబ్బదని వాళ్లు స్కూల్ లేదా కాలేజీలు మధ్యలో డ్రాప్ చేసి సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారని అపోహ ప్రచారంలో ఉంది. అయితే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో కూడా చదువులో గొప్పగా రాణించిన వారు చాలామంది ఉన్నారు అన్న సంగతి ఎవరికి తెలియదు. అలాంటి వారిలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంగ్లీష్ లిటరేచర్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. హీరోయిన్ సాయి పల్లవి కూడా ఎంబిబిఎస్ ను పూర్తి చేశారు. అలాగే తమన్నా ముంబైలో నేషనల్ కాలేజీ ఆర్ట్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. అలాగే త్రిష కూడా బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసుకుని తర్వాత మోడలింగ్ రంగం ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

samantha-ruth-prabhus-10th-class-report-card-viral-on-social-media

 

అయితే ఈ వరుసలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉన్నారు. స్కూల్ డేస్ లో సమంత చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని నిరూపించే విధంగా సమంతకు సంబంధించిన మార్కుల రిపోర్ట్ కార్డు ఒకటి నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ రిపోర్ట్ కార్డులో సమంత మార్కులు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఈ రిపోర్ట్ కార్డు సమంత పదవ తరగతి కి సంబంధించినదని అర్థమవుతుంది. చెన్నైలోని సిఎస్ఐ సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్లో 2001 – 2002 హాఫ్ ఇయర్లీ ప్రోగ్రెస్ కార్డు ఇది. ఇక దీనిలో మొత్తం 1000 మార్కులకు గాను సమంత 887 మార్పులు సాధించింది. ఇక వీటిలో మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు రాగా , ఇంగ్లీషులో 90 , ఫిజిక్స్లో 95 , బోటనీలో 84 , జాగ్రఫీలో 83, హిస్టరీలో 91 మార్కులను సమంత సాధించింది.

samantha-ruth-prabhus-10th-class-report-card-viral-on-social-media

అయితే సమంత సినిమాలలో మాత్రమే కాదు చదువులో కూడా నెంబర్ వన్ అని ఈ మార్కులు చూస్తుంటే అర్థమవుతుంది. అయితే సమంత చెన్నైలో స్టెల్లా మేరీ కాలేజీ 2007లో బీకాం పూర్తి చేసింది. ఇక తర్వాత నటన పై ఉన్న ఆసక్తితో ఆమె సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇది ఇలా ఉండగా సమంత టెన్త్ మార్క్స్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వారల్ అవుతుంది. దీంతో సమంత అభిమానులు టాపర్ ఎక్కడున్న సరే టాపర్ అని కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత ఇటీవల నటించిన శాకుంతలం సినిమా అంతగా సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సమంత సీటాడేల్ వెబ్ సిరీస్ మరియు ఖుషి సినిమాలో నటిస్తున్నారు.