Samantha Ruth Prabhu : జిమ్ లో తెగ కష్టపడుతున్న సమంత…వీడియో వైరల్…
Samantha Ruth Prabhu : స్టార్ హీరోయిన్ సమంత ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సమంత జిమ్ లో ఎక్కువగా వర్క్ ఔట్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫిట్ గా ఉండేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు జిమ్ లో తాను చేసే వర్క్ ఔట్స్ సంబంధించిన ఫోటోలను విడియోలను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో […]
Samantha Ruth Prabhu : స్టార్ హీరోయిన్ సమంత ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సమంత జిమ్ లో ఎక్కువగా వర్క్ ఔట్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫిట్ గా ఉండేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు జిమ్ లో తాను చేసే వర్క్ ఔట్స్ సంబంధించిన ఫోటోలను విడియోలను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతాయి. అయితే తాజాగా సమంత వర్కౌట్స్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇక ఈ వీడియోలో గమనించినట్లయితే బ్లాక్ టూ బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్ లో రెండు చేతులతో కార్యూలాను పట్టుకొని సమంత హార్డ్ వర్క్ చేస్తుంది. ఇక ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోకమానరు. అయితే హీరో నాగచైతన్య తో విడాకులు తీసుకున్న అనంతరం సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమంత పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ తో మస్తు క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా సమంత తేరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2 లో సమంత నటించి బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మరోవైపు యాడ్స్ లో కూడా కనిపిస్తూ చాలా బిజీగా ఉంది సమంత.
అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో తాజాగా ఖుషి సినిమా తో హిట్ అందుకున్న సమంత తెలుగులో కొత్త సినిమాలను కమిట్ అయినట్లుగా కనిపించడం లేదు. దీంతో సమంత కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా సమంత జిమ్లో వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. తన వైవాహిక జీవితం పై సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ రూమర్స్ వచ్చిన సరే సమంత తన స్టైల్ లో సమాధానం ఇస్తూ వస్తుంది. అయితే మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకుని వచ్చిన సమంత జిమ్ లో మరి ఇంతలా కష్టపడడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంతలా వర్క్ అవుట్స్ చేయకు సామ్ మంటూ సలహాలు ఇస్తున్నారు.