Salaar Trailer Leak : సలార్ సినిమా ట్రైలర్ లీక్…మామూలుగా లేదు భయ్యా…

Salaar Trailer Leak : ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్… సంచాలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది. కే జి ఎఫ్ వంటి భారీ సిరీస్ తర్వాత ప్రశాంత్ చేపట్టిన ఈ సలార్ సినిమాపై విపరీతంగా క్రేజ్ ఏర్పడింది. కేజిఎఫ్ వంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ […]

  • Published On:
Salaar Trailer Leak : సలార్ సినిమా ట్రైలర్ లీక్…మామూలుగా లేదు భయ్యా…

Salaar Trailer Leak : ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్… సంచాలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది. కే జి ఎఫ్ వంటి భారీ సిరీస్ తర్వాత ప్రశాంత్ చేపట్టిన ఈ సలార్ సినిమాపై విపరీతంగా క్రేజ్ ఏర్పడింది. కేజిఎఫ్ వంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్టును ప్రకటించిన రోజు నుండే విపరీతంగా అంచనాలు పెరిగాయి. ఆ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి కాబట్టే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్రశాంత్ నిల్ రూపొందిస్తున్నారు.

salaar-movie-trailer-leaked

అయితే సినిమా అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడ తప్పు జరగకూడదనే ఉద్దేశంతో సెప్టెంబర్ 28న విడుదల చేయాల్సిన ఈ సలార్ సినిమాను డిసెంబర్ 22 కు వాయిదా వేశారు. ఇలా చాలాసార్లు పోస్ట్ పోన్ అవడంతో ,అలాగే సినిమాకు సంబంధించిన అప్డేట్లను సరిగా ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ డిసెంబర్ 1న విడుదల చేస్తారని తేలియజేశారు.

salaar-movie-trailer-leaked

అయితే మూవీ మేకర్స్ ఇటీవల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెస్టింగ్ కోసం ప్రైవేట్ స్క్రీన్ లో ట్రైలర్ ను చూశారు. అయితే ఆ స్క్రీన్ లో ప్రభాస్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇక ఆ ఫోటోలో ప్రభాస్ లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాక ట్రైలర్ లో ప్రభాస్ ము ఊర మాస్ లెవెల్ లో చూపించడంతో సినిమా రేంజ్ మారిపోయింది. మరి ముఖ్యంగా కొన్ని యాక్షన్స్ సీన్స్ అయితే ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆతృతను కలిగిస్తాయట. ఆ స్థాయిలో సినిమా ట్రైలర్ ఉంటుందని పలువురు చెబుతున్నారు. మరి చూడాలి ట్రైలర్ ఫ్యాన్స్ ను ఎలా ఆకట్టుకుంటుందో.