Sai Pallavi : వాళ్లు చేసిన పనికి నాలుగేండ్లు సినిమాలకు దూరమైన సాయి పల్లవి…ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

Sai Pallavi : తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నిన్న తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమెకు చాలామంది నుంచి శుభాకాంక్షలు వచ్చాయి. ఈ క్రమంలో తమిళ్ బ్యూటీ సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిలో కొన్ని మీకోసం…. సాయి పల్లవి తమిళనాడులోని కోయంబత్తూర్ అనే గ్రామంలో 1992 మే 9న జన్మించారు. నిన్నటితో ఈ ముద్దుగుమ్మ 31 సంవత్సరాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సాయి […]

  • Published On:
Sai Pallavi : వాళ్లు చేసిన పనికి నాలుగేండ్లు సినిమాలకు దూరమైన సాయి పల్లవి…ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

Sai Pallavi : తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నిన్న తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమెకు చాలామంది నుంచి శుభాకాంక్షలు వచ్చాయి. ఈ క్రమంలో తమిళ్ బ్యూటీ సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిలో కొన్ని మీకోసం…. సాయి పల్లవి తమిళనాడులోని కోయంబత్తూర్ అనే గ్రామంలో 1992 మే 9న జన్మించారు. నిన్నటితో ఈ ముద్దుగుమ్మ 31 సంవత్సరాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సాయి పల్లవికి ఆమె ఫ్యాన్స్ మరియు సెలబ్రెటీస్ కొందరు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవిది ప్రత్యేకమైన శైలి.

sai-pallavi-who-stayed-away-from-films-for-four-years-because-of-what-they-did-interesting-facts

మిగతా వాళ్ళతో పోస్తే సినిమా పరంగా ఆమె తీసుకునే నిర్ణయాలు చాలా భిన్నంగా ఉంటాయి. గ్లామర్ షో చేసే పాత్రల కంటే ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎక్కువగా నటిస్తుంటారు. ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడుతూ నిర్భయంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. అయితే సాయి పల్లవి కోయంబత్తూర్ లోనే తన చదువును పూర్తి చేసింది. సాయి పల్లవి తల్లి డాన్సర్ కావడంతో తనకు కూడా డాన్స్ పై ఆసక్తి పెరిగింది. దీంతో స్కూల్ డేస్ లోనే డాన్స్ తో అదరగొట్టింది. ఆ తర్వాత సినిమాలు పైన ఆసక్తి పెరగడంతో మొదటిసారిగా ధామ్ ధూమ్ అనే తమిళ్ సినిమాలో చిన్న పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డాన్స్ పై ఫోకస్ చేసి పలు డాన్స్ షోలలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది.దీంతో సాయి పల్లవి కి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.

sai-pallavi-who-stayed-away-from-films-for-four-years-because-of-what-they-did-interesting-facts

కానీ ఆమె తల్లిదండ్రులు వద్దు అని చెప్పడంతో జార్జియా వెళ్లి మెడిసిన్ చదివింది. ఈ కారణంగా సాయి పల్లవి నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. తిరిగి వచ్చాక నటి అవ్వాలని ప్రయత్నించగా.. దర్శకుడు అల్ఫోన్ తెరకెక్కించిన “ప్రేమమ్” అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత “ఫిదా” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇంకా ఈ సినిమా తర్వాత సాయి పల్లవి కి తెలుగులో అవకాశాలు వచ్చాయి. చివరిగా సాయి పల్లవి “విరాటపర్వం” సినిమాలో నటించి అలరించింది. ఆ తర్వాత వచ్చిన” గార్గి ” అనే సినిమాలో తన నేచురల్ యాక్టింగ్ తో అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఆమె చేతులలో లేవు.ముందు ముందు ఎలాంటి ప్రాజెక్టులు చేస్తుందో వేచి చూడాలి.