Sai Dharam Tej : గంజాయి శంకర్ గా సాయి ధరమ్ తేజ్…పవన్ కళ్యాణ్ కు పోటీగా..

Sai Dharam Tej  : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదట పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తీసిన తొలి సినిమాతోనే హిట్ అందుకున్న మెగా అల్లుడు ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ సుప్రీం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకొని సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైన సాయి […]

  • Published On:
Sai Dharam Tej : గంజాయి శంకర్ గా సాయి ధరమ్ తేజ్…పవన్ కళ్యాణ్ కు పోటీగా..

Sai Dharam Tej  : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదట పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తీసిన తొలి సినిమాతోనే హిట్ అందుకున్న మెగా అల్లుడు ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ సుప్రీం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకొని సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైన సాయి ధరమ్ తేజ్….పూర్తిగా కోలుకుని విరూపాక్ష సినిమాతో భారీ బ్లాక్ భాస్కర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా నిలిచింది. అనంతరం సాయి ధరమ్ తేజ్ తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీ స్టార్ మూవీ అయిన బ్రో సినిమాలో నటించారు.

sai-dharam-tej-as-ganjai-shankar-competition-to-pawan-kalyan

సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా పాజిటివ్ టాక్ తో నడిచింది. ఇక బ్రో సినిమా అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా…సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఈ సినిమాను జైలు నేపథ్యంలో సాగే కథ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ లుక్ కొత్తగా ఉండబోతుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మాస్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపించబోతున్నట్లుు సమాచారం.

sai-dharam-tej-as-ganjai-shankar-competition-to-pawan-kalyan
అయితే ప్రస్తుతం ఈ సినిమా యొక్క టైటిల్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాకు గంజాయి శంకర్ అనే టైటిల్ పేట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తుండగా డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. అయితే డైరెక్టర్ సంపత్ నందికి కూడా ఈ సినిమా ఒక మలుపురాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటే అతను డైరెక్టర్ గా సెటిల్ అవడం ఖాయం. ఈ నేపద్యంలో ఈ సినిమాకు గంజాయి శంకర్ అనే టైటిల్ పెట్టె సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో మామ గుడుంబా శంకర్ అల్లుడు గంజాయి శంకర్ అంటూ నేటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.