Rajeev Kanakala : బాబు అరెస్టుపై చంద్రబాబు స్పందించకపోవడానికి కారణం ఇదే…రాజీవ్ కనకాల…

Rajeev Kanakala : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సినీ నటుడు స్టార్ హీరో ఎన్టీఆర్ స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో బాలకృష్ణను విలేకరులు అడగగా ” ఐ డోంట్ కేర్ బ్రదర్” అంటూ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసలు ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి అని ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుండి […]

  • Published On:
Rajeev Kanakala : బాబు అరెస్టుపై చంద్రబాబు స్పందించకపోవడానికి కారణం ఇదే…రాజీవ్ కనకాల…

Rajeev Kanakala : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సినీ నటుడు స్టార్ హీరో ఎన్టీఆర్ స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో బాలకృష్ణను విలేకరులు అడగగా ” ఐ డోంట్ కేర్ బ్రదర్” అంటూ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసలు ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి అని ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుండి ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై చర్చ కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలో ఇటీవల సినీ నటుడు ఎన్టీఆర్ ప్రాణం స్నేహితుడు రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు.

rajeev-kanakala-gives-clarity-on-jr-ntrs-silence-over-chandrababu-arrest

రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడం వలన ఎన్టీఆర్ స్పందించకపోయి ఉండవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మరియు కరోనా గ్యాప్ లో ఎన్టీఆర్ దాదాపు నాలుగు సినిమాలు చేసేవాడు. కానీ ఆ పరిస్థితుల్లో చేయలేకపోయాడు. దీంతో ప్రస్తుతం ఆయన తన కెరియర్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు దేవర సినిమా తో బిజీగా ఉన్నట్లు రాజీవ్ పేర్కొన్నారు. ఇక ఇది చాలా పెద్ద సినిమా మరియు రెండు భాగాలుగా వస్తుండడంతో చాలా బిజీగా ఉండి ఉంటారని చెప్పారు. అంతేకాక ఎన్టీఆర్ కు నటన అంటే ప్రాణం. దానికోసం ఎంత సమయానైనా సరే కేటాయిస్తాడు.కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో సినిమాపై ఎన్టీఆర్ దృష్టి పెట్టి ఉంటారని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.

rajeev-kanakala-gives-clarity-on-jr-ntrs-silence-over-chandrababu-arrest

అనంతరం తాను రాజకీయాల్లోకి వచ్చే విషయంపై మాట్లాడుతూ…రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు కచ్చితంగా వస్తా కానీ రాజకీయాల్లోకి వచ్చే ముందు వాటిని అధ్యయం చేయాలి. ఎంతో తెలుసుకోవాలి. కాబట్టి ఓ రెండు మూడేళ్ల సమయం పట్టవచ్చు. అవేమీ చేయకుండా ఇప్పటికిప్పుడు రాజకీయాలు మొదలుపెడతా అంటే అది కరెక్ట్ కాదు. ఒకప్పటితో పోల్చి చూస్తే రాజకీయాలు ఇప్పుడు చాలా మారిపోయాయి. వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయి. కానీ ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం రాజీవ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.