Pushpa Jagadeesh : పుష్ప జగదీష్ అరెస్ట్…కారణం ఏంటంటే

Pushpa Jagadeesh : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా పుష్ప2 కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా లవర్స్ అంతా ఈ పుష్ప 2 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర ఎంతగానో హైలెట్ అయింది. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో అంతగా పాపులర్ అయిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది కేశవ పాత్ర అని చెప్పాలి. అయితే ఈ క్యారెక్టర్ విపరీతంగా హైలెట్ అవడంతో […]

  • Published On:
Pushpa Jagadeesh : పుష్ప జగదీష్ అరెస్ట్…కారణం ఏంటంటే

Pushpa Jagadeesh : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా పుష్ప2 కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా లవర్స్ అంతా ఈ పుష్ప 2 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర ఎంతగానో హైలెట్ అయింది. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో అంతగా పాపులర్ అయిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది కేశవ పాత్ర అని చెప్పాలి. అయితే ఈ క్యారెక్టర్ విపరీతంగా హైలెట్ అవడంతో నటుడు జగదీష్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే అతనికి సినీ అవకాశాలు కూడా విపరీతంగా వచ్చాయి. అయితే ప్రస్తుతం జగదీష్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అతనిపై తాజాగా కేసు నమోదు అవ్వడమే కాకుండా అతనిని పోలీసులు రిమాండ్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. అయితే ఓ మహిళ ఆత్మహత్య కేసులో జగదీష్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.

pushpa-jagadish-arrested-the-reason-is

దీంతో ప్రస్తుతం జగదీష్ అలియాస్ కేశవ పేరు రెండు రాష్ట్రాల్లో విపరీతంగా వినిపిస్తుంది.  ఇప్పుడిప్పుడే నటుడుగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న కేశవ అసలు ఈ కేసులో ఎలా భాగమయ్యాడు. అతను చేసిన తప్పేంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే గత నెల 29న ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతి మృతికి జగదీష్ కారణం అంటూ మృతురాలి తండ్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే యువతి యొక్క కాల్ డేటాను కూడా సంపాదించడం జరిగింది. దీనిలో పోలీసులకు ఓ చిన్న క్లూ దొరికినట్లుగా తెలుస్తోంది. ఆ యువతి ఫోన్ నుంచి ఓ యువకుడికి ఎక్కువసార్లు ఫోన్ మెసేజ్ లు వెళ్ళినట్లుగా బయటపడింది. దీంతో ముందుగా పంజాగుట్ట పోలీసులు ఆ యువకుడుని అదుపులోకి తీసుకున్నారు. ఇక కుర్రాడిని విచారణ చేయడంతో ఈ కేసులోకి జగదీష్ పాత్ర వచ్చి పడింది.

అయితే పోలీసులు చేసిన విచారణలో యువకుడు నవంబర్ 27న జరిగిన ఒక ముఖ్యమైన విషయం గురించి పోలీసులకు తెలియజేశాడు. చనిపోయిన యువతి నేను ఆమె అపార్ట్మెంట్లో సన్నిహితంగా ఉన్నామని అదే సమయంలో జగదీష్ మా ఇద్దరి ఫోటోలు తీసాడని , అంతేకాక లోనికి వచ్చి మమ్మల్ని బెదిరించాడని తెలియజేశాడు. ఇక ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో అక్కడి నుంచి జగదీష్ వెళ్ళిపోయినట్లుగా తెలియజేశాడు. ఆ తర్వాత జగదీష్ యువతి ఫోన్ కు తన దగ్గర ఉన్న ఫోటోలు షేర్ చేసి బెదిరించడం మొదలు పెట్టాడని, అందుకే యువతి ఆత్మహత్యకు పాల్పడిందని యువకుడు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు నటుడు జగదీష్ పై ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే చనిపోయిన యువతకి జగదీష్ కి సంబంధం ఏంటి అనే విషయం పై విచారణ చేపట్టగా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పూర్తి వివరాలు క్రింది విడియో లో చూడవచ్చు.