Pushpa 2 :పుష్ప 2 షూటింగ్ లో అల్లు అర్జున్ కు గాయం…

Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి గాయమైందా పుష్ప 2 షూటింగ్ లో ఆయన గాయపడ్డారా..చిత్ర యూనిట్ కావాలని విషయం దాస్తుందా.. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక పిక్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే పుష్ప అల్లు అర్జున్ రేంజ్ ని పూర్తిగా మార్చేసింది అని చెప్పాలి. అప్పటివరకు సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే సుపరిచితమైన బన్నీ తాజాగా పుష్ప సినిమాతో పాన్ […]

  • Published On:
Pushpa 2 :పుష్ప 2 షూటింగ్ లో అల్లు అర్జున్ కు గాయం…

Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి గాయమైందా పుష్ప 2 షూటింగ్ లో ఆయన గాయపడ్డారా..చిత్ర యూనిట్ కావాలని విషయం దాస్తుందా.. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక పిక్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే పుష్ప అల్లు అర్జున్ రేంజ్ ని పూర్తిగా మార్చేసింది అని చెప్పాలి. అప్పటివరకు సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే సుపరిచితమైన బన్నీ తాజాగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.పుష్పా పుష్పరాజ్ తగ్గేదే లే అనే డైలాగ్ అందరికీ అలా రిజిస్టర్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్ లో దర్శనమించారు. ఏ సినిమాలో కనిపించనంత మాస్ గా కనిపించారు .ఫుల్ అండ్ డిఫరెంట్ తో కనిపించడంతో సినిమాకు ప్లస్ గా మారింది. అలాగే బన్నీ యాక్టింగ్ సినిమాకు హిట్ తెప్పించి పెట్టింది. ఈ తరుణంలోనే పుష్ప 2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే దీనికోసం ఫాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

పుష్పా సూపర్ హిట్ అయితే ఇక పార్ట్ 2 ఎలా ఉంటుందో అనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దీనితో చిత్ర బృందం చాలా కష్టపడుతుంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇక అల్లు అర్జున్ కూడా చాలా కష్టపడుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఆయనను ఎలా ఊహించుకున్నారు. అలాగే తెరపై కనిపిస్తున్నారు. పర్ఫెక్ట్ టైంలో ఈ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే షూటింగ్ లో అల్లు అర్జున్ కి గాయం తగిలినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఒక పిక్ వైరల్ అవుతుంది .ఇక ఆ పిక్ లో అల్లు అర్జున్ చేతికి బ్యాండేజ్ వేసుకొని కనిపించారు. దీంతో షూటింగ్ లో అల్లు అర్జున్ చేతికి కి గాయమైందని క్లారిటీ వచ్చింది.అయితే ఈ విషయాన్ని బయటకు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్న మొదలైంది .ఇది ఇలా ఉంటే బన్నీకి జరిగిన ప్రమాదంపై అభిమానులు ఆందోళనలకు గురవుతున్నారు. చేతికి ఏమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15 రిలీజ్ అవుతుందా అని లేదా పోస్ట్ పోన్ అవుతుందా అనే భయం కూడా పట్టుకుంది. మరి వేచి చూడాలి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో.