Prithviraj Sukumaran : సలార్ సినిమా డైలాగులు లీక్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్…

Prithviraj Sukumaran : మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రైటర్ గా , యాక్టర్ గా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు. అయితే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభాస్ బర్త్డే సందర్భంగా పృధ్వీరాజ్ సుకుమారన్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిని చూస్తుంటే […]

  • Published On:
Prithviraj Sukumaran : సలార్ సినిమా డైలాగులు లీక్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్…

Prithviraj Sukumaran : మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రైటర్ గా , యాక్టర్ గా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు. అయితే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభాస్ బర్త్డే సందర్భంగా పృధ్వీరాజ్ సుకుమారన్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిని చూస్తుంటే సలార్ మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ని పృథ్వీరాజ్ లీక్ చేసినట్లుగా అర్థమవుతుంది.

prithviraj-sukumar-leaked-salaar-movie-dialogues

అయితే ఇవాళ అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ కు పృథ్వీరాజ్ స్పెషల్ విషెస్ చెబుతూ… యుద్ధానికి నువ్వు నీ ఆర్మీ ని తీసుకువస్తే నేను అతడిని తీసుకొచ్చా….వరదరాజ మన్నారు..అని ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ ఇది సినిమాలోని డైలాగ్ అంటూ ఖుషి అవుతున్నారు. అంతేకాక సలార్ సినిమాలో పృధ్వీరాజ్ వరదరాజ మన్నారు అనే పాత్రలో నటిస్తున్నట్లుగా ఆయనే తెలియజేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.దీంతో ప్రస్తుతం పృధ్విరాజ్ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం పృధ్వీరాజ్ లూసీఫర్ సినిమా రీమేక్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అలాగే సలార్ సినిమాలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే మలయాళం లో పృధ్వీరాజ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ లోకేష్ కనకరాజు మరియు రాజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో నటించబోతున్నట్లు సమాచారం.