Pragathi : జాతీయస్థాయిలో సత్తా చాటిన సిని నటి ప్రగతి…
Pragathi : తెలుగు సినీ ఇండస్ట్రీలో తల్లిపాత్రకు ఎవరు బాగా సెట్ అవుతారంటే దానిలో కచ్చితంగా ప్రగతి పేరు ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో మొదట హీరోయిన్ గా కెరియర్ ను ప్రారంభించిన ప్రగతి , తన సెకండ్ ఇన్నింగ్స్ లో హీరో హీరోయిన్లకు తల్లి, వదిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత నుండి చూసుకున్నట్లయితే ప్రగతి సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆమె రోజు చేసే జిమ్ […]
Pragathi : తెలుగు సినీ ఇండస్ట్రీలో తల్లిపాత్రకు ఎవరు బాగా సెట్ అవుతారంటే దానిలో కచ్చితంగా ప్రగతి పేరు ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో మొదట హీరోయిన్ గా కెరియర్ ను ప్రారంభించిన ప్రగతి , తన సెకండ్ ఇన్నింగ్స్ లో హీరో హీరోయిన్లకు తల్లి, వదిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత నుండి చూసుకున్నట్లయితే ప్రగతి సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆమె రోజు చేసే జిమ్ వర్క్ ఔట్స్ సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. మరి ముఖ్యంగా ఆమె ఫిట్నెస్ కోసం తీసుకునే జాగ్రత్తలు చూసి నేటి తరం సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా 48 ఏళ్ల వయసున్న ప్రగతి జిమ్ లో ఏకంగా 80 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి పడేసింది. అయితే సినీ ఇండస్ట్రీలో చాలా సాఫ్ట్ గా కనిపించే ప్రగతి రియల్ లైఫ్ లో ఇలా కనిపించడంతో ఆడియన్స్ సైతం అవాక్ అవుతున్నారు. అయితే తాజాగా బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ నిర్వహించడం జరిగింది. జాతీయస్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో సినీ నటి ప్రగతి కూడా పాల్గొన్నారు.
అయితే ఈ పోటీలో ప్రొఫెషనల్ ట్రైనర్స్ కూడా ఉన్నారు. అయినప్పటికీ వారికి ఏమాత్రం తగ్గకుండా ప్రగతి గట్టి పోటీ ఇచ్చి పోటీలో ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. దీంతో కాంస్య పథకం సాధించి తన సత్తా చాటుకుంది.. అయితే బెంగళూరులోని ఇంజనీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా ఈ పోటీలు నిర్వహించారు. అయితే ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పోటీపడి ప్రగతి ఈ పథకం సాధించడం నిజంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో గర్వకారణమని చెప్పాలి.