Pooja Hegde : పూజా హెగ్డే అందాల ఆరబోత ..బ్రదర్ సంగీత్ వేడుకలో బుట్ట బొమ్మలా మెరిసిన బ్యూటీ .. పిక్స్ వైరల్

Pooja Hegde : తెలుగులో ముకుంద సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ పూజ హెగ్డే కు వరుస సినీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అవుదాం అనుకున్నా టైం లో డైరెక్టర్ త్రివిక్రమ్ ‘ అరవింద సమేత వీర రాఘవరెడ్డి ‘ సినిమాలో ఆఫర్ ఇచ్చారు. అప్పటిదాకా వరుస […]

  • Published On:
Pooja Hegde : పూజా హెగ్డే అందాల ఆరబోత ..బ్రదర్ సంగీత్ వేడుకలో బుట్ట బొమ్మలా మెరిసిన బ్యూటీ .. పిక్స్ వైరల్

Pooja Hegde : తెలుగులో ముకుంద సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ పూజ హెగ్డే కు వరుస సినీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అవుదాం అనుకున్నా టైం లో డైరెక్టర్ త్రివిక్రమ్ ‘ అరవింద సమేత వీర రాఘవరెడ్డి ‘ సినిమాలో ఆఫర్ ఇచ్చారు. అప్పటిదాకా వరుస ప్లాపులతో ఉన్న పూజకు ఈ సినిమా సూపర్ హిట్ ను అందించింది. దీంతో తర్వాత మహేష్ బాబు ‘ మహర్షి ‘ సినిమాలో నటించి మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. అలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అయితే ఇటీవల పూజా హెగ్డే ఇంట్లో వేడుక జరిగింది. ఆమె బ్రదర్ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని పూజ హెగ్డే అభిమానులతో పంచుకున్నారు. అన్నయ్య పెళ్లిలో పూజ సందడి చేశారు. వదినమ్మ కి స్వాగతం అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అలాగే బ్రదర్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.తాజాగా చోళీ లెహంగా ధరించిన పూజా గ్లామరస్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అవి సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలు. బ్రదర్ సంగీత్ వేడుక కోసం ఇలా అందంగా రెడీ అయ్యానని పూజ తెలిపింది.

బ్రదర్ పెళ్లి ముగిసిన నేపథ్యంలో అభిమానులు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఆ ఫోటోలను చూస్తూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సరే పూజ హెగ్డే ఆ డ్రెస్ లో చాలా అందంగా ఉంది. పెళ్లి వేడుకలో బుట్ట బొమ్మలా మెరిసిందని అంటున్నారు. ఇకపోతే ‘ అలవైకుంఠపురంలో ‘ సినిమాతో హిట్ కొట్టిన పూజ ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం మహేష్ బాబు ‘ ఎస్ఎస్ఎంబి28 ‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం.

Must Read :Raw Onion cures Diabetis : పచ్చి ఉల్లిపాయతో డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా ..?