Himaja : నటి హిమజ ఇంటిపై పోలీసులు దాడి… క్లారిటీ ఇచ్చిన హిమజ…

Himaja : దీపావళి పండుగను పురస్కరించుకొని గత రెండు రోజులుగా సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీలు వారి వారి స్నేహితులతో దీపావళి పండుగను చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెర నటి హిమజ దీపావళి పర్వదినాన తన కొత్త ఇంట్లో ప్రవేశించే స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలని అనుకుందట. […]

  • Published On:
Himaja : నటి హిమజ ఇంటిపై పోలీసులు దాడి… క్లారిటీ ఇచ్చిన హిమజ…

Himaja : దీపావళి పండుగను పురస్కరించుకొని గత రెండు రోజులుగా సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీలు వారి వారి స్నేహితులతో దీపావళి పండుగను చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెర నటి హిమజ దీపావళి పర్వదినాన తన కొత్త ఇంట్లో ప్రవేశించే స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలని అనుకుందట. అయితే ఈ పార్టీలో భాగంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటూ పోలీసులకు సమాచారం రావడంతో హిమజ ఇంటిపై పోలీసులు దాడి చేసి వారి ఇంటిని తనిఖీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక కొన్ని మీడియా సంస్థలు అయితే ఏకంగా హిమజను అరెస్టు చేశారంటూ కూడా వార్తలు రాశారు.

police-raided-actress-himajas-house-himaja-gave-clarity

ఈ విధంగా హిమజతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో తాజాగా ఈ వార్తలపై హిమజ స్పందించారు. ఇక ఈ విషయం గురించి క్లారిటీ ఇస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా వీడియోని షేర్ చేశారు.ఇక ఆ వీడియోలో హిమజ మాట్లాడుతూ నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు నేను మా ఇంట్లోనే ఉన్నాను…దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.ఇక పోలీసులు మా ఇంటికి వచ్చింది నిజమే.వారు వచ్చారు ఇంటి మొత్తం చెక్ చేసుకుని వెళ్లిపోయారు.

వారి డ్యూటీ వారు చేసుకున్నారు కాబట్టి నేను వారికి సహకరించాను. ఇక ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో నన్ను అరెస్టు చేశారు నేను జైల్లో ఉన్నాను అంటూ పలు రకాలుగా రాస్తున్నారు. ఇక వాళ్లంతా అలా ఎందుకు రాస్తున్నారు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాలి అనుకోవట్లేదు అంటూ హిమజ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో స్నేహితులు సన్నిహితులు అందరూ పదేపదే ఫోన్ చేస్తున్నారని చాలా డిస్టబెన్స్ గా ఉందని అందుకే ఈ వీడియో చేసి క్లారిటీ ఇస్తున్నట్లుగా హిమజ తెలియజేశారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.