NTR30 Devara : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ దేవర లేటెస్ట్ ఫోటోస్…అభిమానులకు పండగే….

NTR30 Devara  : జూనియర్ ఎన్టీఆర్ డేడికెషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర కోసం తనను తాను ఎలాంటి స్థితిలోకైనా మార్చుకుంటాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. గంటల తరబడి వర్కౌట్లు చేసి సిక్స్ ప్యాక్ తో అందరిని ఆకట్టుకున్నాడు. అయితే ఎన్టీఆర్ తన కెరియర్ మొదటి దశలో చాలా లావుగా ఉండేవాడు. ఓ దశలో అయితే ఎన్టీఆర్ పూర్తిగా షేప్ అవుట్ కూడా […]

  • Published On:
NTR30 Devara : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ దేవర లేటెస్ట్ ఫోటోస్…అభిమానులకు పండగే….

NTR30 Devara  : జూనియర్ ఎన్టీఆర్ డేడికెషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర కోసం తనను తాను ఎలాంటి స్థితిలోకైనా మార్చుకుంటాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. గంటల తరబడి వర్కౌట్లు చేసి సిక్స్ ప్యాక్ తో అందరిని ఆకట్టుకున్నాడు. అయితే ఎన్టీఆర్ తన కెరియర్ మొదటి దశలో చాలా లావుగా ఉండేవాడు. ఓ దశలో అయితే ఎన్టీఆర్ పూర్తిగా షేప్ అవుట్ కూడా అయ్యారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రాఖి సినిమాలో ఎన్టీఆర్ లుక్ ను ఫాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేరు అనే చెప్పాలి. దీంతో ఎన్టీఆర్ పై సర్వత్ర విమర్శలు రాగా ఆయన పూర్తిగా బరువు తగ్గారు. మరల శరీరం బరువు పెరగకుండా ఆహార నియమాలను పాటిస్తూ జాగ్రత్త వహిస్తున్నారు.

ntr-devara-latest-photos-shaking-the-social-media

ఇదిలా ఉండగా తాజాగా ఓ ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ కండలు పెంచుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ నటించబోతున్న 30వ సినిమా భైరవ కోసం ఎన్టీఆర్ సీరియస్ గా కండలు పెంచుతున్నాడని ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రెండు పాత్రల మధ్య వ్యత్యాసం చూపించే ఆస్కారం ఉంది. అయితే ఇటీవల ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవర ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా అది కాస్త కేక పుట్టించింది. చేతిలో ఆయుధం , పంచ కట్టుతో ఎన్టీఆర్ గెటప్, ఫ్యాన్స్ అంచనాలను దాటేసింది.

ntr-devara-latest-photos-shaking-the-social-media

 

ఇక ఈ సినిమాను 2024 సమ్మర్ కానుకగా విడుదల చేస్తామని చిత్ర బంధం ప్రకటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటించనుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పుడు భారి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి. ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్నారు. అంతేకాక వార్ 2 సినిమా కూడా వచ్చే ఏడాది మొదలుకానుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పెద్దపెద్ద ప్రాజెక్టులతో అభిమానులకు పెద్ద పండుగనే ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది.