Nandamuri Balakrishna : ఆ ఫ్లెక్సీలను అందుకే తీపించా… ఎన్టీఆర్ ఫ్లెక్సీల పై స్పందించిన బాలయ్య…

Nandamuri Balakrishna : నందమూరి కుటుంబాల్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయని గురువారం నుండి పలు డిజిటల్ మీడియా సైట్స్ కొన్ని యూట్యూబ్స్ ఛానల్స్ కూడా రచ్చ చేస్తున్నాయి.అది కూడా జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్య మధ్య సఖ్యత లేదని బావ చంద్రబాబు నాయుడు అల్లుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని ఎదగనికుండా ఏం చేయాలో అన్ని చేస్తున్నారంటూ పిచ్చి రాతలు రాసుకొస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఎవరో దిక్కు మొక్కు లేని అనమకుల తో […]

  • Published On:
Nandamuri Balakrishna : ఆ ఫ్లెక్సీలను అందుకే తీపించా… ఎన్టీఆర్ ఫ్లెక్సీల పై స్పందించిన బాలయ్య…

Nandamuri Balakrishna : నందమూరి కుటుంబాల్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయని గురువారం నుండి పలు డిజిటల్ మీడియా సైట్స్ కొన్ని యూట్యూబ్స్ ఛానల్స్ కూడా రచ్చ చేస్తున్నాయి.అది కూడా జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్య మధ్య సఖ్యత లేదని బావ చంద్రబాబు నాయుడు అల్లుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని ఎదగనికుండా ఏం చేయాలో అన్ని చేస్తున్నారంటూ పిచ్చి రాతలు రాసుకొస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఎవరో దిక్కు మొక్కు లేని అనమకుల తో విశ్లేషణ జరిపించి వారి చేత పిచ్చికుతులు చేస్తున్నారు. ఇన్నాళ్లు లోపల జరుగుతున్న ఫైట్ ఇప్పుడు బహిర్గతమైందంటూ రెండు మెయిన్ న్యూస్ ఛానల్ లో గురువారం నుండి పదే పదే ఈ విషయం పై నాన రచ్చ చేస్తున్నాయి. దీనంతటికీ కారణం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ పేరిట అక్కడ వెలిసిన ఫ్లెక్సీలు బాలకృష్ణ తీసేయమని ఆదేశించడం.బాలకృష్ణ అక్కడికి వెళ్ళగానే ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం హాట్ టాపిక్ అయింది.మహనీయుడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కుటుంబ సభ్యులు పలువురు నేతలు నివాళులు అర్పించారు.

balayya-reacted-to-ntrs-flexes

అయితే ఎన్టీఆర్ కి నివాళులు అర్పించేందుకు బాలకృష్ణ అక్కడికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి అక్కడ నుండి తీసేయమని ఆదేశించారు. ఇక అప్పుడు పదే పది నిమిషాలలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడ నుండి తీసేసారు. దీంతో వైసిపి మీడియా గురువారం నుంచి పండగ చేసుకుంటుంది.ఎన్టీఆర్ కుటుంబంలో గొడవలు బహిర్గతమయ్యాయి అని టిడిపి అధినేత చంద్రబాబు మధ్య గొడవ పెట్టారని లోకేష్ కోసం ఎన్టీఆర్ ని ఎదగనివ్వడం లేదని ఇష్ట రాజ్యాంగా పోస్టులు పెడుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే బాలయ్య ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని ఆదేశించిన వీడియో వైసిపి నేతలకు కొబ్బరికాయ చిప్పలాగా దొరికింది. నిజంగా బాలకృష్ణ తీరుపై ఎవరు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బాబాయ్ తీసేసారని స్వాగతించాడు. కానీ వైసిపి డిజిటల్ మీడియా లో చెబుతున్నట్లు ఇది అంత ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలతో చేసిందో , లేదా లోకేష్ కోసం చేసిందో కాదట.. వివరంగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ మంచి కోరే పని చేశారు అని అంటున్నారు.

అబ్బాయి మంచి కోసం బాబాయ్ ఎంతో బాధ్యత తో ఈ ఫ్లెక్సీ లను తీసేసారని చెబుతున్నారు. జరిగేది శుభకార్యమో జాతరనో కాదు ఆరాధ్య దైవం అభిమానుల నాయకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళింది ఆ పెద్దాయన గుర్తు చేసుకునేందుకు. అలాంటి చోటికి గణ స్వాగతం అంటూ ఫ్లెక్సీలను పెట్టడం ఎంత మాత్రం సముచితం కాదని బాధ తప్ప అక్కడికి వచ్చే వారికి స్వాగతం చెప్పడం ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే బాలయ్య ఆ ఫ్లెక్సీలు తీసేశారు.ఇక ఈ ఫ్లెక్స్ వివాదానికి కారణమైన ఎన్టీఆర్ అభిమాని గతంలో ఇలాగే ఎన్టీఆర్ వర్ధంతికి భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో అప్పుడు కూడా వాటిని తొలగించారు. అలాంటి కార్యక్రమంలో ఇలాంటి వద్దని చెప్పాను కానీ మళ్ళీ అదే పని చేశారు. దాంతో బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. గతంలో చెప్పిన మళ్లీ అదే పని చేశారు అనే విషయం తెలిసిన తర్వాత బాబాయ్ బాలయ్య సక్రమంగా వ్యవహరించారని.. ఎన్టీఆర్ సోదరి సుహాసిని పక్కన ఉండగానే ఫ్లెక్సీ లు తొలగించారని ఇది వివాదం కాదు బాధ్యత అని అర్థమవుతుంది.