Niharika : భర్తతో విడాకుల రూమర్స్ నిజం అనేలా నిహారిక పోస్ట్..ఆ వీడియోలో ఏముందంటే..

Niharika : మెగా హీరో నాగబాబు డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే 2020లో జొన్నలగడ్డ చైతన్యతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న నిహారిక చైతన్య ల మధ్య కొన్ని విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఎంతో అన్యూన్యంగా ఉండే ఈ జంట మధ్య కొన్ని కలహాలు రావడంతో విభేదాలు తారస్థాయికి చేరాయని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఎలాంటి పార్టీలకైనా జంటగా వెళ్లే నిహారిక చైతన్యలు […]

  • Published On:
Niharika : భర్తతో విడాకుల రూమర్స్ నిజం అనేలా నిహారిక పోస్ట్..ఆ వీడియోలో ఏముందంటే..

Niharika : మెగా హీరో నాగబాబు డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే 2020లో జొన్నలగడ్డ చైతన్యతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న నిహారిక చైతన్య ల మధ్య కొన్ని విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఎంతో అన్యూన్యంగా ఉండే ఈ జంట మధ్య కొన్ని కలహాలు రావడంతో విభేదాలు తారస్థాయికి చేరాయని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఎలాంటి పార్టీలకైనా జంటగా వెళ్లే నిహారిక చైతన్యలు ఈ మధ్య అసలు కనిపించకపోవడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.

అంతేకాక ఇంస్టాగ్రామ్ లో నిహారిక చైతన్యలు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం నిహారికతో దిగిన ఫోటోలను అలాగే వారి పెళ్లి ఫోటోలను సైతం అన్నింటిని చైతన్య డిలీట్ చేయడంతో నెట్టింట వస్తున్న వార్తలకు మరింత బలం చేకూర్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందంటూ నెట్టింటి వార్తలు వస్తున్నాయి. వీరిపై సోషల్ మీడియాలో ఇంత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ విషయంపై వారి స్పందించకపోవడం గమనార్హం. అయితే వీరు నిజంగానే విడాకులు తీసుకుపోతున్నారా లేక ఇది కేవలం రూమర్స్ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా ఈ సంవత్సరం వరుణ్ తేజ్ కు నాగబాబు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అయితే వరుణ్ తేజ్ పెళ్లికి చెల్లి విడాకులు అడ్డం వస్తున్నాయని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇటీవల విడాకులు వార్తలు నేపథ్యంలో నిహారిక తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఓ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రోమోన్ షేర్ చేసింది. డెడ్ పిక్సెల్ అనే పేరుతో తర్కెక్కుతున్న ఈ సినిమాను నిహారిక స్వయంగా నిర్మించడమే కాక నట్టించడం గమనార్హం. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)