Niharika Konidela : జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి…ఎమోషనల్ అయిన నిహారిక…

Niharika Konidela  : మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే. అయితే మొదట యాంకర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. కానీ ఆమెకు ఊహించిన గుర్తింపు మాత్రం లభించలేదు . ఈ నేపథ్యంలోనే సినిమాలకు బాయ్ చెప్పి నిహారిక పెళ్లి పీటలెక్కింది. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారికకు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఒక పెళ్లి అనంతరం కొన్నాళ్లపాటు వీరి కాపురం సాఫీగానే సాగింది. కానీ […]

  • Published On:
Niharika Konidela : జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి…ఎమోషనల్ అయిన నిహారిక…

Niharika Konidela  : మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే. అయితే మొదట యాంకర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. కానీ ఆమెకు ఊహించిన గుర్తింపు మాత్రం లభించలేదు . ఈ నేపథ్యంలోనే సినిమాలకు బాయ్ చెప్పి నిహారిక పెళ్లి పీటలెక్కింది. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారికకు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఒక పెళ్లి అనంతరం కొన్నాళ్లపాటు వీరి కాపురం సాఫీగానే సాగింది. కానీ కొన్నాళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు ఆశ్చర్యపోయారు.

niharika-interesting-post-on-instagram-story

ఇక విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంట్టున్నారు. ఈ క్రమంలోనే నిహారిక వేరే దేశాలకు వెళ్లి తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా ఆమెకు సంబంధించిన ఫోటోలను వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇదిలా కొనసాగుతుంటే చైతన్య జొన్నలగడ్డ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను పెట్టింది. 7 జి బృందావనం కాలనీ సినిమాలోని లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కన్నుల భాషలు తెలియవులే అనే ఎమోషనల్ సాంగ్ ను తన స్టోరీలో షేర్ చేసింది.

దీంతో ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం లేపుతోంది. నిహారిక తన భర్తను మర్చిపోలేక ఇలా ఎమోషనల్ అవుతుందంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అంతేకాక ఇన్ని రోజులు ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నట్లు దిగిన ఫోటోలను వీడియోలను షేర్ చేసిన నిహారిక సడన్ గా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పెట్టడంతో తన భర్త కోసమే నిహారిక ఇలా చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.