Niharika : పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు…

Niharika  : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నిహారిక తాజాగా నిఖిల్ విజయేంద్రసింహ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ జనసేన గురించి పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. నాన్న కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఉండడంతో మా ఓట్లు ఏపీకి బదిలీ చేయడం జరిగింది అని నిహారిక తెలిపారు. ఏపీకి ఎవరి అవసరం ఉందో వారికే ఓటు వేస్తానని […]

  • Published On:
Niharika : పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు…

Niharika  : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నిహారిక తాజాగా నిఖిల్ విజయేంద్రసింహ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ జనసేన గురించి పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. నాన్న కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఉండడంతో మా ఓట్లు ఏపీకి బదిలీ చేయడం జరిగింది అని నిహారిక తెలిపారు. ఏపీకి ఎవరి అవసరం ఉందో వారికే ఓటు వేస్తానని ఏపీకి పవన్ కళ్యాణ్ కావాలి అని నాకు తెలుసు. ఏపీ ప్రజలు ఇంకా రియల్ అవ్వట్లేదని నిహారిక చెప్పుకొచ్చారు. అయితే 500 రూపాయలు ఇచ్చి ప్రజల నుంచి 5 లక్షల రూపాయల లాక్కునే వారు కాదు అని ,పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదని లీడర్ అని నిహారిక కామెంట్లు చేశారు.బాబాయ్ తో నేను ఎక్కువగా మాట్లాడలేదని నాన్న బాబాయ్ తో జరిగేవన్నీ నాకు చెబుతారని నిహారిక వెల్లడించడం గమనార్హం.

బాబాయ్ కల్మషం లేని మనిషి అని బాబాయ్ కి మా కుటుంబ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని నిహారిక పేర్కొన్నారు. ఈసారి కూడా జనసేన తరపున ప్రచారానికి వెళ్తానని నిహారిక చెప్పుకొచ్చారు. మా బాబాయ్ కి ఎలాంటి వ్యాపారాలు లేవని సినిమాల్లో వచ్చిన డబ్బుని జనసేనలో పెడుతున్నారని జనాల సమస్యలను పరిష్కరించాలని మా బాబాయ్ భావిస్తారని నిహారిక తెలిపారు. పవన్ మీ లీడర్ అని పిలుస్తారని ఆమె తెలుపుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కి అంత డబ్బు ఎలా వస్తుందని తెలియదని నిహారిక పేర్కొన్నారు.నిహారిక ఏపీ పాలిటిక్స్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నిహారిక ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నది. పర్సనల్ లైఫ్ గురించి నిహారిక చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. నిహారిక రాబోయే రోజుల్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.