Chandrababu : టిడిపి శ్రేణులకు పండుగ…

Chandrababu  : ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీతో పొత్తు కోసం దాదాపు తపస్సు చేస్తున్న చంద్రబాబు నాయుడుకి ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు , పవన్ కళ్యాణ్ యొక్క సపోర్టు ఇంకా కొంతమంది ప్రముఖుల సహాయంతో టిడిపి తో పొత్తుకి నరేంద్ర మోడీ ఒప్పుకున్నారు. అయితే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ఆంధ్రాలో సభ పెట్టి ఆ సభలో ముగ్గురు పాల్గొనడానికి నరేంద్ర మోడీ ప్లాన్ […]

  • Published On:
Chandrababu  : టిడిపి శ్రేణులకు పండుగ…

Chandrababu  : ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీతో పొత్తు కోసం దాదాపు తపస్సు చేస్తున్న చంద్రబాబు నాయుడుకి ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు , పవన్ కళ్యాణ్ యొక్క సపోర్టు ఇంకా కొంతమంది ప్రముఖుల సహాయంతో టిడిపి తో పొత్తుకి నరేంద్ర మోడీ ఒప్పుకున్నారు. అయితే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ఆంధ్రాలో సభ పెట్టి ఆ సభలో ముగ్గురు పాల్గొనడానికి నరేంద్ర మోడీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ఏపీకి వచ్చి జగన్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది వేచి చూడాలి. అయితే ఢిల్లీ నుండి రిటర్న్ ఫ్లైట్ ఎక్కుతూ ఏపీ నేతలకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు చంద్రబాబు నాయుడు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… ఇక విషయానికొస్తే నారా చంద్రబాబు నాయుడు చాలా సంతోషంగా ఫ్లైట్ ఎక్కబోతున్నారని తెలుస్తుంది. 2014 రిజల్ట్ నీ ముందుగానే ఊహించారు.

అలాగే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు అని తెలుస్తుంది.  సీట్ల పంపిణీ విషయంలో కూడా ఒక రకమైన క్లారిటీ వచ్చింది. ఇప్పుడు బిజెపి కి కొన్ని ఎంపి సీట్లు ఇచ్చి, జనసేనకు కొన్ని ఎంపీ సీట్లు ఇచ్చి , మిగిలిన సీట్లను టిడిపి ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేల సీట్ల విషయానికి వస్తే మళ్లీ అదే తలకాయ నొప్పి వచ్చింది. అయితే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దానిపైన సర్దుబాటు అయింది. ఇక అదే ఇప్పుడు చంద్రబాబుకు సంతోషాన్ని ఇచ్చే వార్త అయింది. ఇందులో భాగంగా జనసేన కు 25 నుంచి 27 సీట్ల వరకు ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు ,ఇక ఇదే విషయాన్ని అక్కడ చెప్పినట్లు ,అలాగే బీజేపీ కూడా కలిసి వస్తుంది కాబట్టి 2014లో కంటే 15 స్థానాలు ఎక్కువగా బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. దానితో జనసేనకు రెండు ఎంపీ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఏడిపి సీట్లు బిజెపికి ఇస్తే అసలు పోటీ చేయడానికి బీజేపీలో ఏడుగురు నేతలు ఉన్నారా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.

ఇక బిజెపిలో బలమైన నేతలు లేరు కాబట్టి టిడిపి నుంచి కొంతమంది నేతలను రాజీనామా చేయించి బీజేపీ లో కి పంపించి పొత్తులో భాగంగా వారిన నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బిజెపికి తొమ్మిది సీట్లను ఇచ్చారు. అయితే అక్కడ పేరుకు మాత్రమే 9 సీట్ల లో పోటీ చేసింది కానీ ఐదు సీట్ల మాత్రమే పోటీ చేస్తుంది. మొత్తానికి వీరి ప్లాన్ ఇలా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు చాలా ఖుషి గా ఉన్నారని తెలుస్తుంది. బిజెపిలో స్ట్రాంగ్ గా ఉన్న నేతలకు ఇద్దరు ముగ్గురికి ఎంపి టికెట్లు ఇచ్చి మిగతా వారిని టిడిపి శ్రేణులకు టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆలోచించారు అని సమాచారం. మొత్తానికి చంద్రబాబు నాయుడు మోడీతో ఏదైతే అనుకున్నారో 2014 లాగా మళ్లీ పొత్తు కుదిరిందని చాలా ఖుషి గా ఉన్నారు. మరి మొన్నటివరకు జగన్ తో సన్నిహితంగా ఉన్న నరేంద్ర మోడీ ఏపీ కి వచ్చినప్పుడు జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు…? జగన్ ప్రభుత్వాన్ని ఆయన ఎలా తప్పు పడతారు అనే దానిపై వేచి చూడాల్సి ఉంటుంది.