Klin Kaara Konidela : ఎట్టకేలకు క్లింకార ఫేస్ రివిల్…చూశారా ఎలా ఉందో…
Klin Kaara Konidela : ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి నేపథ్యంలో ఇటలీ దేశం చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ అందమైన దేశంలో మెగా కుటుంబమంతా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. […]
Klin Kaara Konidela : ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి నేపథ్యంలో ఇటలీ దేశం చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ అందమైన దేశంలో మెగా కుటుంబమంతా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూన్ 9న వీరికి నిశ్చితార్థం కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
ఇక ఇప్పుడు నవంబర్ 1న వీరిద్దరి వివాహం జరగనుంది. ఇక ఈ వివాహాన్ని ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే మెగా చిరంజీవితో సహా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ తదితరులు అందరూ ఇటలీ దేశానికి చేరుకున్నారు. ఇక వీరితో ఉపాసన కొణిదల ఫ్యామిలీ కూడా కలవడం జరిగింది. అలాగే మెగా వారసురాలు క్లింకార కూడా వెళ్లడం జరిగింది. అయితే రామ్ చరణ్ దంపతులు మొదటి నుండి క్లింకార ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా రామ్ చరణ్ ఉపాసన కుటుంబ సభ్యులు కలిసి దిగిన గ్రూప్ ఫోటోలో క్లింకార ను మనం చూడొచ్చు.
అయితే ఈ ఫోటోలో క్లింకార మొఖం కనిపించకుండా చిన్న ఎమోజి అడ్డుగా పెట్టారు కానీ..క్లింకార పేస్ ఎదురుగా ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కనిపిస్తుంది. ఇక దీనిలో క్లింకారను స్పష్టంగా చూడలేకపోయినా కాస్త ఫేస్ అయితే కనిపించింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా నాలుగు రోజులు పాటు జరగబోయే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొననున్నారు. అనంతరం నవంబర్ 5వ తేదీన హైదరాబాదులో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ వేడుకలో రాజకీయ మరియు చిత్ర ప్రముఖులకు కూడా ఆహ్వానం ఉంటుంది.
View this post on Instagram