Naa Anveshana : ప్రపంచ యాత్రికుడిని ఆడేసుకున్న నవీన్ పోలిశెట్టి…ఆటగాళ్లు అందరికీ అదిరిపోయే మెసేజ్…..

Naa Anveshana  : ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గురించి దాదాపు అందరికీ తెలుసు.ఇప్పటివరకు ఏడు ఖండాలను ,ఆరు ప్రపంచ వింతలను , అమెజాన్ అడవులను , ప్రపంచ విడ్డూరాలను వింతలను విశ్లేషిస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చూపిస్తూ వస్తున్నాడు. అంతేకాక ప్రపంచంలోనే ఫేమస్ యూట్యూబర్ గా మన దేశం లోనే యూట్యూబ్ నుంచి ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న నెంబర్ 1 యూట్యూబర్ గా అన్వేష్ రికార్డు సృష్టిస్తున్నాడు. ఇక అన్వేష్ […]

  • Published On:
Naa Anveshana : ప్రపంచ యాత్రికుడిని ఆడేసుకున్న నవీన్ పోలిశెట్టి…ఆటగాళ్లు అందరికీ అదిరిపోయే మెసేజ్…..

Naa Anveshana  : ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గురించి దాదాపు అందరికీ తెలుసు.ఇప్పటివరకు ఏడు ఖండాలను ,ఆరు ప్రపంచ వింతలను , అమెజాన్ అడవులను , ప్రపంచ విడ్డూరాలను వింతలను విశ్లేషిస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చూపిస్తూ వస్తున్నాడు. అంతేకాక ప్రపంచంలోనే ఫేమస్ యూట్యూబర్ గా మన దేశం లోనే యూట్యూబ్ నుంచి ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న నెంబర్ 1 యూట్యూబర్ గా అన్వేష్ రికార్డు సృష్టిస్తున్నాడు. ఇక అన్వేష్ యూట్యూబ్ లో షేర్ చేసే ఒక్కొక్క వీడియో కొన్ని గంటల్లోనే కొన్ని మిలియన్ వ్యూస్ ను సాధిస్తూ దూసుకుపోతుంటాయి. ఈ క్రమంలోనే నా అన్వేషణ ఛానల్ యొక్క ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే తాజాగా నా అన్వేషణను హీరో నవీన్ పోలిశెట్టి యాజ్ ఇట్ ఇస్ దింపేశారు.

naveen-polishety-imitates-naa-anveshana-youtube-channel

అచ్చం అన్వేష్ మాట్లాడిన తీరుగా మాట్లాడుతూ ఇటీవల ఆయన నటించిన మిస్ శెట్టి మిస్టర్ పులి శెట్టి సినిమా ప్రమోషన్ చేశాడు. ఇక నవీన్ పోలిశెట్టి మిమిక్రీ అయితే అన్వేష్ ఒరిజినల్ వాయిస్ లాగానే ఉండడంతో ఈ వీడియో మరింత వైరల్ అయింది. నా అన్వేషణను నవీన్ పోలిశెట్టి అచ్చు గుద్దినట్లుగా దింపేశారు. ఇక ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా తన అకౌంట్ నుండి షేర్ చేశాడు.అలాగే ఈ వీడియో కి ” నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఎవర్రా మీరంతా ” అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. నవీన్ పోలిశెట్టి మాట్లాడిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. మిమిక్రీతో దింపేసాడు అంటూ టాలెంటెడ్ పర్సన్ అంటూ నేటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.