Daggubati Family : డెక్కన్ కిచెన్ కూల్చివేత హీరో వెంకటేష్ రాణాలపై కేసు నమోదు కు నాంపల్లి కోర్ట్ ఆదేశం…

Daggubati Family : టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయినా దగ్గుపాటి వెంకటేష్ రానా పై నాంపల్లి లో కేసు నమోదైనది. దగ్గుపాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. అయితే ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత చేయడం వలన దగ్గుబాటి కుటుంబం పై నాంపల్లి కోర్టు కేసుపై ఆదేశం ఇచ్చినట్లు తెలుస్తుంది. దగ్గుబాటి కుటుంబంలో వెంకటేష్ సురేష్ రాణా అభి రాములపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ […]

  • Published On:
Daggubati Family : డెక్కన్ కిచెన్ కూల్చివేత హీరో వెంకటేష్ రాణాలపై కేసు నమోదు కు నాంపల్లి కోర్ట్ ఆదేశం…

Daggubati Family : టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయినా దగ్గుపాటి వెంకటేష్ రానా పై నాంపల్లి లో కేసు నమోదైనది. దగ్గుపాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. అయితే ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత చేయడం వలన దగ్గుబాటి కుటుంబం పై నాంపల్లి కోర్టు కేసుపై ఆదేశం ఇచ్చినట్లు తెలుస్తుంది. దగ్గుబాటి కుటుంబంలో వెంకటేష్ సురేష్ రాణా అభి రాములపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి క్రిమినల్ కోర్ట్ అయితే దగ్గుబాటి ఫ్యామిలీ పై డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ నాంపల్లిలో ఫిర్యాదు చేశాడు. దానితో నాంపల్లి కోర్ట్ సోమవారం విచారణ చేపట్టింది. దగ్గుబాటి ఫ్యామిలీ కోర్ట్ ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ కూల్చివేత కు పాల్పడ్డారని యజమాని నందకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

nampally-court-order-to-register-case-against-deccan-kitchen-demolition-hero-venkatesh-rana

అలాగే వెంకటేష్ మరియు ఇతర కుటుంబ సభ్యులపై ఐపిసి సెక్షన్ 448, 452 , 380 ,506, 120 బి కింద వీరిపై కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డెక్కన్ కిచెన్ లో కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేసినందున మరియు ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని నందన్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే లీజ్ విషయంలో తమకు కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దగ్గు పాటి ఫ్యామిలీ అక్రమంగా కూల్చివేతకు పాల్పడ్డారని నందన్ కుమార్ వివరించారు. అయితే దానివల్ల తనకు 20 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకొని మరి హోటల్ ను కూల్చి వేశారని అన్నారు. ఈ నేపథ్యంలోనే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించుకున్నారు.