Nagababu : అన్నదమ్ములు కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ అయినా నాగబాబు…ఫోటో వైరల్..

Nagababu : నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇటలీలోని టస్కనీ అనే పురాతన గ్రామంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహ వేడుకలకు మెగా ఫ్యామిలీతో పాటు త్రిపాఠి ఫ్యామిలీ అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వరుణ్ లావణ్య పెళ్లికి […]

  • Published On:
Nagababu : అన్నదమ్ములు కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ అయినా నాగబాబు…ఫోటో వైరల్..

Nagababu : నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇటలీలోని టస్కనీ అనే పురాతన గ్రామంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహ వేడుకలకు మెగా ఫ్యామిలీతో పాటు త్రిపాఠి ఫ్యామిలీ అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వరుణ్ లావణ్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతుండగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి .

nagababu-is-emotional-while-sharing-photos-of-brothers-together-photo-viral

అదేవిధంగా మెగా ఫ్యామిలీలోని అందరూ ఒకే ఫోటోను షేర్ చేస్తూ వచ్చారు. అయితే ఎన్ని ఫోటోలు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఫోటోకి వచ్చిన క్రేజ్ అంతా అంతా కాదు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఫోటోలు కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన ఇద్దరు బ్రదర్స్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు నాగబాబును చూడవచ్చు. ఇలా ముగ్గురు అన్నదమ్ములు కలిసి దిగిన ఫోటోలను నాగబాబు షేర్ చేస్తూ మా మధ్య ఎన్ని విభేదాలు ఉన్న వాదనలు రెగ్యులర్ గా వచ్చిన మా బంధం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ,

మా బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుందని రాసుకొచ్చారు. మేము చేసిన పనులు మా జ్ఞాపకాలు మాత్రమే కాదు మా మధ్య ఏర్పడే విభేదాలు కంటే కూడా మా బంధం చాలా ముఖ్యమైనది. మా ఈ రిలేషన్ షిప్ అనేది ఎన్నో మంచి క్షణాలపై ఆధారపడి ఉంటుంది. మా మధ్య ఈ బంధం అనేది నిజంగా చాలా బలమైనది , ఎవరు విడదీయలేనిది అంటూ ఎమోషనల్ గా రాస్కొచ్చారు. దీంతో మెగా బ్రదర్ షేర్ చేసిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకే ఫోటోలో ముగ్గురు అన్నదమ్ములను చూసిన మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.