Nagababu : పాకీజా పరిస్థితి దారుణం .. ఆర్థిక సాయం చేసిన నాగబాబు ..

Nagababu : నటి పాకీజా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు నటించిన ‘ అసెంబ్లీ రౌడీ ‘ సినిమాలో పాకీజా పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘ పెదరాయుడు ‘ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది. సినిమాలో పాకీజా పాత్ర బాగా పాపులర్ కావడంతో ఆమెకు పాకీజా అనే పేరు వచ్చేసింది. అసలైతే ఆమె అసలు పేరు వాసుకి. పాకీజా పేరు మంచి […]

  • Published On:
Nagababu : పాకీజా పరిస్థితి దారుణం .. ఆర్థిక సాయం చేసిన  నాగబాబు ..

Nagababu : నటి పాకీజా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు నటించిన ‘ అసెంబ్లీ రౌడీ ‘ సినిమాలో పాకీజా పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘ పెదరాయుడు ‘ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది. సినిమాలో పాకీజా పాత్ర బాగా పాపులర్ కావడంతో ఆమెకు పాకీజా అనే పేరు వచ్చేసింది. అసలైతే ఆమె అసలు పేరు వాసుకి. పాకీజా పేరు మంచి గుర్తింపు తీసుకురావడంతో పాకీజా వాసుకిగా పేరు మారిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ఖాళీ లేకుండా గడిపిన పాకీజా ప్రస్తుతం దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఉండటానికి ఇల్లు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ నానా కష్టాలు పడుతున్నారు.

ప్రస్తుతం పాకీజా హాస్టల్ లో ఉంటూ కాలం గడుపుతున్నారని తెలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన దారుణమైన పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. తినడానికి తిండి లేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, నా అన్న వాళ్ళు నన్ను వదిలేశారు. ఒకప్పుడు నేను సినిమా లో బిజీగా ఉండడంతో ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు నా దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉండడంతో నా దగ్గర ఏమీ లేకపోవడంతో నా వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. అందుకే హాస్టల్లో ఉంటూ కాలం గడుపుతున్నారని చెప్పుకు వచ్చారు.

అయితే ఈమె పరిస్థితి తెలుసుకున్న మెగా బ్రదర్ నాగబాబు ఆర్థికంగా సహాయం చేశారు. పాకీజాగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్ ఇప్పుడు కష్టకాలంలో ఉండటం చూస్తే చాలా బాధగా ఉంది అన్నారు. బుల్లితెర కానీ సినిమాలో కానీ ఆమెకు ఒక చిన్నదో పెద్దదో ఒక పాత్ర ఇస్తే తన కాళ్ళ మీద తాను నిలబదెందుకు పరిశ్రమ ఆమెకు సాయపడాలి. నేను కూడా నా వంతు సాయం చేస్తాను అని అన్నారు. నాగబాబు ఆమెకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాకీజా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతా అని అన్నారు.

Must Read : SBI Loan Offers : SBI లో బారీ ఆఫర్లు.. పెరగనున్న ఇంటి రుణం వడ్డీ రెట్లు..