Naga Chaitanya : సమంత కోసం ఫ్లాట్ ను అప్పనంగా రాసిచ్చిన నాగచైతన్య..

Naga chaitanya : నాగచైతన్య సమంత వారి పెళ్లి తర్వాత ఒక ప్లాట్ ను తీసుకొని వారి టేస్ట్ కు తగ్గట్లుగా అన్ని సమకూర్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వారు అప్పుడు కొనుగోలు చేసిన ఫ్లాట్ ఎవరిదో కాదు నటుడు మురళీమోహన్ ది. అప్పటికే ఆ ఫ్లాట్ ను వేరే వాళ్లకు ఇవ్వాలనుకున్నప్పటికీ నాగచైతన్య సమంత అడగడంతో వారి మాట కాదనలేక ప్లాట్ ను వారికి అమ్మినట్లు చెప్పుకొచ్చారు. అయితే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న […]

  • Published On:
Naga Chaitanya : సమంత కోసం ఫ్లాట్ ను అప్పనంగా రాసిచ్చిన నాగచైతన్య..

Naga chaitanya : నాగచైతన్య సమంత వారి పెళ్లి తర్వాత ఒక ప్లాట్ ను తీసుకొని వారి టేస్ట్ కు తగ్గట్లుగా అన్ని సమకూర్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వారు అప్పుడు కొనుగోలు చేసిన ఫ్లాట్ ఎవరిదో కాదు నటుడు మురళీమోహన్ ది. అప్పటికే ఆ ఫ్లాట్ ను వేరే వాళ్లకు ఇవ్వాలనుకున్నప్పటికీ నాగచైతన్య సమంత అడగడంతో వారి మాట కాదనలేక ప్లాట్ ను వారికి అమ్మినట్లు చెప్పుకొచ్చారు.

అయితే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ ను చై – సామ్ కి ఇచ్చేసి బయటికి వచ్చేసాడు. ఆ తర్వాత చై – నాగార్జున వాళ్ళింట్లో కూడా ఉండకుండా హోటల్స్ లోనే ఉండడం అలవాటు చేసుకున్నాడు. అయితే రెండేళ్ల క్రితం చై తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరికతో నాగార్జున ఇంటికి దగ్గరలో ఒక స్థలాన్ని కొని తనకు నచ్చినట్లుగా ఇంటిని నిర్మించుకున్నాడట.

naga-chaitanya-gave-a-flat-for-samantha

naga-chaitanya-gave-a-flat-for-samantha

ఇక ఇప్పుడు ఆ ఇల్లు పూర్తికాగా పది రోజుల క్రితమే చైతన్య ఆ ఇంట్లో అడుగు పెట్టాడట. తనకు తన అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించుకున్న ఇంట్లోనే తాను ఉండబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఇంట్లో మంచి స్విమ్మింగ్ పూల్, థియేటర్, జిమ్, గార్డెన్, తనకు వచ్చినట్లుగా డిజైన్ చేయించుకున్నాడట నాగచైతన్య. దీంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం చైతన్య ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు తాను చేస్తున్న కస్టడీ సినిమాతో హిట్ లభిస్తుందని చై నమ్ముతున్నాడు. మరి కస్టడీ సినిమా నాగచైతన్యకు ఎలాంటి హిట్ ను అందిస్తుంది అనేది చూడాలంటే మే వరకు ఆగక తప్పదు.