Tollywood : ప్రభాస్ వల్లే నా జీవితం ఇలా అయింది.. బలగం దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.

Tollywood : జబర్దస్త్ కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బలగం సినిమాతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు వేణు. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకోవడంతో వేణు ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు సినీ పరిశ్రమలో తాను పడిన కష్టాలు నష్టాల గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాక తన కెరీర్ మధ్యలో అగిపోవడానికి కారణం ప్రభాస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

  • Published On:
Tollywood :  ప్రభాస్ వల్లే  నా జీవితం ఇలా అయింది.. బలగం దర్శకుడు  సంచలన వ్యాఖ్యలు.

Tollywood : జబర్దస్త్ కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బలగం సినిమాతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు వేణు. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకోవడంతో వేణు ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు సినీ పరిశ్రమలో తాను పడిన కష్టాలు నష్టాల గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాక తన కెరీర్ మధ్యలో అగిపోవడానికి కారణం ప్రభాస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

my-life-has-become-like-this-because-of-prabhas-balagam-directors-sensational-comments

అసలు విషయంలోకి వెళ్తే..వేణు మాట్లాడుతూ సినిమా నన్ను మోసం చేయదు అని నేను నమ్మాను ఆ నమ్మకం తోనే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇదివరకే కొన్ని సినిమాలలో నేను పని చేసినప్పటికీ అంత గుర్తింపు రాలేదు. కేవలం నన్ను ఒక కమెడియన్ గా మాత్రమే చూశారు. అంతేకాక ప్రభాస్ వళ్ళనే నా కెరియర్ ఇలా ముగిసిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ప్రభాస్ నటించిన మున్నా సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని వేణు చాలా కలలు కన్నారట, కానీ ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది.

my-life-has-become-like-this-because-of-prabhas-balagam-directors-sensational-comments

దీంతో ఆ సినిమాలో నటించిన వేణుకు కూడా కష్టాలు మొదలయ్యాయట. నా కెరియర్ లో నేను చాలా ఇబ్బందులు పడ్డాను, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు నేనే డైరెక్టర్ గా మారి బలగం సినిమా తీయడం, అది పెద్ద సక్సెస్ అవడం నాకు చాలా ఆనందంగా ఉందని , అంతేకాక నేను నా దైవంగా భావించే చిరంజీవి గారు ఆ సినిమాను చూసి నన్ను నా టీం ను సన్మానించడం ఎంతో ఆనందాన్ని కలుగజేసింది అని వేణు చెప్పారు. అలాగే ప్రభాస్ విషయంలో వేణు చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.