Bigg Boss 7 : నాలుగో వారం ఓటింగ్ లో పోటీపడుతున్న కండల వీరులు…డేంజర్ లో రతిక, టేస్టీ తేజ..

Bigg Boss 7  : బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగో వారం ఆట రసవత్తరంగా మారింది. ఇక ఇప్పటికే హౌస్ నుండి ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా నాలుగో వారం ఎలిమినేషన్ కి ఆట మొదలైంది. ఇక సోమవారం, మంగళవారం జరిగిన నామినేషన్ వచ్చేసరికి ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్ లో వచ్చారు. అయితే ప్రస్తుతం గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ , ప్రియాంక జైన్ , శుభశ్రీ , రతిక రోజ్, టేస్టీ తేజఉన్నారు. […]

  • Published On:
Bigg Boss 7 : నాలుగో వారం ఓటింగ్ లో పోటీపడుతున్న కండల వీరులు…డేంజర్ లో రతిక, టేస్టీ తేజ..

Bigg Boss 7  : బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగో వారం ఆట రసవత్తరంగా మారింది. ఇక ఇప్పటికే హౌస్ నుండి ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా నాలుగో వారం ఎలిమినేషన్ కి ఆట మొదలైంది. ఇక సోమవారం, మంగళవారం జరిగిన నామినేషన్ వచ్చేసరికి ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్ లో వచ్చారు. అయితే ప్రస్తుతం గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ , ప్రియాంక జైన్ , శుభశ్రీ , రతిక రోజ్, టేస్టీ తేజఉన్నారు. అయితే గత రాత్రి నుండి ఓటింగ్స్ ఓపెన్ కాగా కండల వీరులు ఇద్దరు గౌతమ్ కృష్ణ మరియు ప్రిన్ యావర్ ఓటింగ్ లో ఫస్ట్ ప్లేస్ కోసం హోరా హోరిగా తలపడుతున్నారు.

muscle-heroes-competing-in-the-fourth-week-of-voting-ratika-and-tasty-teja-in-danger

గత గత రెండు వారాలుగా డాక్టర్ బాబుకు గేమ్ లో సంచాలకులుగా వ్యవహరిస్తున్న వారు దెబ్బతిస్తున్నారు. ఇక గత వారం గేమ్ లో సందీప్ సంచాలకుడిక చెత్త నిర్ణయం తీసుకోవడంతో గౌతమ్ పవర్ అస్త్ర చాన్స్ ని మిస్ చేసుకున్నాడు. అదే విధంగా నిన్నటి టాస్క్ లో కూడా అదే తంతు కొనసాగింది. శోభ శెట్టి ముందు షర్టు విప్పాడని పనికి మాలిన రీజన్స్ ని పల్లవి ప్రశాంత్ చెప్పడంతో జ్యూరి సభ్యులు కూడా దానిని అంగీకరించి అకారణంగా గౌతమ్ ను నామినేషన్ లోకి నెట్టారు. అయితే గౌతమ్ కొద్దిగా ఆవేశపడుతున్నాడన్న మాటే కానీ అతను చెప్పే పాయింట్స్ మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాయి. దీంతో ఆడియోస్ అతనికి బ్రహ్మారాదం పడుతున్నారు. నామినేషన్ లో అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.

muscle-heroes-competing-in-the-fourth-week-of-voting-ratika-and-tasty-teja-in-danger

దీంతో ప్రస్తుతం అన్ అఫీషియల్ ఓటింగ్ రెండులో గౌతమ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ప్రిన్స్ యావరు అతనికి గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే గత వారం దామిని మరియు రతిక యావర్ ను హింస పెట్టిన టాస్క్ తో అతనికి బాగా కలిసొచ్చింది. అప్పటినుండి యావర్ కి కూడా ఓట్లు దండిగా పడుతున్నాయి. దీంతో కొన్ని పోల్స్ లో యావర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే మరికొన్ని పొల్స్ లో గౌతమ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక శోభ శెట్టి మూడో స్థానంలో ఉండగా , సేఫ్ గేమ్ ఆడుతున్న ప్రియాంక గేమ్ కాస్త వెనకబడింది. ఇక రతిక మరియు టేస్టీ తేజ వెనుకంజ లో ఉన్నారు.