Lavanya Tripathi : రిసెప్షన్ వేడుకలలో నూటికి నూరు మార్కులు కొట్టేసిన మెగా కోడలు లావణ్య…

Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ మరియు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మొన్నటివరకు గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణంం నడిపించి నవంబర్ 1 వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. పెద్దల సమక్షంలో వేదమంత్రాలు సాక్షిగా నిండు నూరేళ్లు కలిసి ఉంటామంటూ మూడుముళ్ల బంధంతో లావణ్య వరుణ్ ఒకటయ్యారు. ఇక వీరిద్దరి వివాహ వేడుకలు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి అనంతరం సెలబ్రిటీలు మరియు స్నేహితుల కోసం నవంబర్ […]

  • Published On:
Lavanya Tripathi : రిసెప్షన్ వేడుకలలో నూటికి నూరు మార్కులు కొట్టేసిన మెగా కోడలు లావణ్య…

Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ మరియు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మొన్నటివరకు గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణంం నడిపించి నవంబర్ 1 వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. పెద్దల సమక్షంలో వేదమంత్రాలు సాక్షిగా నిండు నూరేళ్లు కలిసి ఉంటామంటూ మూడుముళ్ల బంధంతో లావణ్య వరుణ్ ఒకటయ్యారు. ఇక వీరిద్దరి వివాహ వేడుకలు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి అనంతరం సెలబ్రిటీలు మరియు స్నేహితుల కోసం నవంబర్ 5వ తేదీన మాదాపూర్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

mega-daughter-in-law-lavanya-scored-100-marks-in-the-reception

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా వారి ఫంక్షన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు కూడా ఈ రిక్రిప్షన్ వేడుకలకు హాజరయ్యారు. ఇక ఈ వేడుకలలో లావణ్య త్రిపాఠి చాలా సింపుల్ లుక్ లో దర్శనమిచ్చింది. బంగారు వర్ణం లాంటి చీర కట్టుకొని మెరిసింది. ఇక ఈ వేడుకలలో కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా పెద్దల పట్ల ఆమెకున్న గౌరవాన్ని చాటి చెప్పింది. ఈ క్రమంలోనే తన పెద్ద మామయ్య మెగాస్టార్ చిరంజీవి పాదాలకు నమస్కరించి చిరంజీవి ఆశీస్సులను తీసుకుంది. అదేవిధంగా అతిథిగా విచ్చేసిన నట గురువు సత్యానంద్ గారి కాళ్లకు కూడా త్రిపాఠి మొక్కింది. ఇక సత్యానంద్ గారి గురించి మనందరికీ తెలిసిందే.

mega-daughter-in-law-lavanya-scored-100-marks-in-the-reception

ఎంతోమంది హీరోలకు మెలకువలు నేర్పించి సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వంటి వారికి కూడా నటన లో శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలోనే దాదాపు 100 మందికి పైగా హీరోలను సత్యానంద్ గారు తయారు చేశారు. అందుకే ఈయన అంటే మెగా కుటుంబానికే కాక ప్రతి స్టార్ హీరోలకు గౌరవం. అందుకే ఆ పెద్దాయన రాగానే లావణ్య ఏ మాత్రం ఆలోచించకుండా ఆయన పాదాలకు నమస్కరించి వినయంగా ఆశీర్వాదం తీసుకుంది. తన వినయం విధేయత చూసిన అభిమానులు తెగ ముచ్చట పడిపోతున్నారు. ఈ క్రమంలోనే మెగా కోడలు లావణ్య నూటికి నూరు మార్కులు కొట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

mega-daughter-in-law-lavanya-scored-100-marks-in-the-reception