Pooja Hegde : ఆగని బుట్ట బొమ్మ ప్రయత్నాలు…ఇక ఫామ్ లోకి రావడం కష్టమే…

Pooja Hegde : రెండేళ్ల క్రితం పూజ హెగ్డే డైరీ చూసుకున్నట్లయితే ఫుల్ బిజీగా ఉండేది. ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పూజ హెగ్డే పేరు దక్కించుకుంది.కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటెం సాంగ్స్ లో కూడా పూజ హెగ్డే అలరించింది. ఇక ఆ సమయంలో ఆమె క్రేజ్ విపరీతంగా ఉండడంతో ఫుల్ బిజీగా ఉండేది. ఈ క్రమంలోనే అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా పూజ హెగ్డే […]

  • Published On:
Pooja Hegde : ఆగని బుట్ట బొమ్మ ప్రయత్నాలు…ఇక ఫామ్ లోకి రావడం కష్టమే…

Pooja Hegde : రెండేళ్ల క్రితం పూజ హెగ్డే డైరీ చూసుకున్నట్లయితే ఫుల్ బిజీగా ఉండేది. ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పూజ హెగ్డే పేరు దక్కించుకుంది.కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటెం సాంగ్స్ లో కూడా పూజ హెగ్డే అలరించింది. ఇక ఆ సమయంలో ఆమె క్రేజ్ విపరీతంగా ఉండడంతో ఫుల్ బిజీగా ఉండేది. ఈ క్రమంలోనే అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా పూజ హెగ్డే సినిమాలు చేస్తూ తన అందాలను ఆరబోస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అందుకే ఆ సమయంలో ఆమె పారితోషకం భారీ ఎత్తున డిమాండ్ చేసింది.

latest-news-about-pooja-hegde

ఈ నేపథ్యంలోనే చాలామంది హీరోయిన్స్ పూజతో పోటీపడేందుకు చాలా కష్టపడ్డారు. కానీ సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా అమ్మడి క్రేజ్ అమాంతం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం సినిమాలో నటించి మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఆ సినిమా నుండి ఆమెను తొలగించడం జరిగింది. దీంతో పూజకు వరుసగా నిరాశలే మిగులుతున్నాయి. బాలీవుడ్ లో కూడా ఒక పెద్ద సినిమా వచ్చినట్లే వచ్చి చేయి జారిపోయింది.

latest-news-about-pooja-hegde

ఇదంతా పక్కన పెడితే ఇంకా తనకు ఆఫర్లు వస్తాయని నమ్మకంతో పూజ గడుపుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే సోషల్ మీడియా వేదికగా ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చిపోతుంది. విపరీతంగా అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంటుంది. ఆమె అందచందాలను చూసినవారు కచ్చితంగా ఆఫర్లు ఇవ్వక తప్పదని చెప్పాలి. అంతేకాక మరి కొన్ని రోజుల్లో కచ్చితంగా పూజకు మంచి ఆఫర్లు వస్తాయంటూ సినీ ఇండస్ట్రీలో కూడా అభిమానులు విశ్వసిస్తున్నారు. మరి ఈ అందాలు ఆరబోస్తూ ఈ అమ్మడు అనుకున్నది సాధిస్తుందో లేదో చూడాలి.