Keerthy Suresh : తనని ట్రోల్ చేశారని ఒక్కసారిగా ఏడ్చేసిన కీర్తి సురేష్..

Keerthy Suresh : ‘ నేను శైలజ ‘ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన తమిళ బ్యూటీ కీర్తి సురేష్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. తనను సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. అలాగే తనకు ఎంతగానో సపోర్ట్ చేసిన దర్శక నిర్మాతలు, అభిమానులు, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ఇండస్ట్రీకి హీరోయిన్ గా వచ్చి […]

  • Published On:
Keerthy Suresh : తనని ట్రోల్ చేశారని ఒక్కసారిగా ఏడ్చేసిన కీర్తి సురేష్..

Keerthy Suresh : ‘ నేను శైలజ ‘ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన తమిళ బ్యూటీ కీర్తి సురేష్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. తనను సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. అలాగే తనకు ఎంతగానో సపోర్ట్ చేసిన దర్శక నిర్మాతలు, అభిమానులు, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ఇండస్ట్రీకి హీరోయిన్ గా వచ్చి పదేళ్లు అవుతుందని, నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్స్ అని, మిమ్మల్ని ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేస్తాను అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు.

keerti-suresh-emotional-on-trollers

అలాగే తనని ట్రోల్ చేసే వారికి కూడా కీర్తి సురేష్ ధన్యవాదాలు చెప్పారు. మనం అందరికీ నచ్చాలని ఏమీ లేదు, నన్ను ట్రోల్ చేసిన వారిని కూడా గౌరవిస్తాను. వారికి కూడా చాలా థాంక్స్ అని కీర్తి సురేష్ కూల్ గా ట్రోలర్స్ కి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. ఇకపోతే కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళంలో చాలా సినిమాలు చేశారు. 2013 నవంబర్లో ‘ గీతాంజలి ‘ సినిమాతో హీరోయిన్గా అవతారం ఎత్తారు. ఇక తెలుగులో ‘ నేను శైలజ ‘ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈమె తన నటనతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నారు. అప్పటినుంచి ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.

ఇక ‘ మహానటి ‘ సినిమా కీర్తి సురేష్ కి తిరుగులేని ఇమేజ్ ను అందించింది. తెలుగు ప్రేక్షకులు మదిలో మహానటి సినిమా చిరస్థాయిగా నిలిచింది. ఆమె కెరీర్లో బెస్ట్ మూవీ మహానటి అని చెప్పాలి. అంతే కాకుండా ఈ సినిమాతో ఉత్తమ జాతీయ నటిగా కూడా అవార్డు అందుకున్నారు. ఇక ఆ తర్వాత ఆమె చేసిన సినిమాల అని ప్లాప్ అవుతూ వస్తున్నాయి. ఇటీవల చిరంజీవితో ‘ భోళాశంకర్ ‘ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో కీర్తి సురేష్ గ్లామర్ విషయంలో స్పీడ్ గానే ఉన్నారని తెలుస్తుంది. మొదట్లో పద్ధతిగా కనిపించిన ఈమె పొట్టి బట్టలు వేసుకొని జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇదంతా సినిమాల కోసమే అని తెలుస్తుంది.