Janhvi Kapoor : నయనతార భర్తతో అందాల రాసి జాన్వీ కపూర్….వామ్మో… పెద్ద ప్లానింగే ఇది….

Janhvi Kapoor : ఒకప్పటి స్టార్ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలియని వారే ఉండరు. ఆమె అందంతో అభినయంతో ప్రేక్షకులు హృదయాలను ఎంతలా గెలుచుకుందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. స్టార్ కిడ్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన జాన్వి తన అందంతో నటనతో పలు ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుంది. అయితే మొన్నటి వరకు హిందీ సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో […]

  • Published On:
Janhvi Kapoor : నయనతార భర్తతో అందాల రాసి జాన్వీ కపూర్….వామ్మో… పెద్ద ప్లానింగే ఇది….

Janhvi Kapoor : ఒకప్పటి స్టార్ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలియని వారే ఉండరు. ఆమె అందంతో అభినయంతో ప్రేక్షకులు హృదయాలను ఎంతలా గెలుచుకుందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. స్టార్ కిడ్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన జాన్వి తన అందంతో నటనతో పలు ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుంది. అయితే మొన్నటి వరకు హిందీ సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇప్పటికే ఓ తెలుగు సినిమాలో జాన్వి నటిస్తోంది. ఇక ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు ఆఫర్లు బాట పట్టాయి.

janhvi-kapoor-with-nayantaras-husband

ఇదిలా ఉంటే జాన్వికి సంబంధించిన మరో వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అలా వస్తున్న వార్తలు ప్రకారం జాన్వీ అతి త్వరలో తమిళ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతుందట. లవ్ టుడే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో ప్రదీప్ రంగనాథ్ తో జాన్వి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. స్వయంగా ఆయనే జాన్వి వద్దకు వెళ్లి ఈ సినిమా గురించి మాట్లాడడం తో జాన్వీ వెంటనే ఓకే చెప్పేసిందట. అయితే ఈ విషయంపై ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ సినిమాను కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

janhvi-kapoor-with-nayantaras-husband

అయితే ఇంతకు ముందు కూడా జాన్వీ కపూర్ తమిళ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుంది అన్న వార్తలు వచ్చాయి. కాలా వస్తున్న వార్తలకు ఆమె తండ్రి స్పందించి అవి వాస్తవం కాదని తేల్చి చెప్పారు.మరి ఇప్పుడు ఇలా వస్తున్న వార్తలు పై నిజం ఎంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో జాన్వి కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించబోతుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. జాన్వి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్ లి జాన్వీ లంగా వోణీలో కొత్తగా కనిపించడం విశేషం. మరి ఈ దేవర సినిమా జాన్వీ కపూర్ కు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపును తెచ్చి పెడుతుందో వేచి చూడాలి.