Vaishnav Tej – Ritu Varma : మెగా హీరో వైష్ణవ తేజ్ – రీతూవర్మ ప్రేమాయణం నిజమేనా…

Vaishnav Tej – Ritu Varma  : ఈమధ్య చాలామంది సినీ సెలబ్రిటీలు తమ మధ్య ఏమీ లేదు అంటూనే చివరికి పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. అలాంటి యువ జంటలను ఇప్పటికే మనం చాలా మందిని చూశాం. అనుష్క శర్మ విరాట్ కోహ్లీ , కాజల్ గౌతమ్ అలాగే ఇటీవల పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ లావణ్య అందరూ ఇదే బాపతి అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ జంటల గురించి ఎన్ని సార్లు వార్తలు వచ్చినప్పటికీ […]

  • Published On:
Vaishnav Tej – Ritu Varma : మెగా హీరో వైష్ణవ తేజ్ – రీతూవర్మ ప్రేమాయణం నిజమేనా…

Vaishnav Tej – Ritu Varma  : ఈమధ్య చాలామంది సినీ సెలబ్రిటీలు తమ మధ్య ఏమీ లేదు అంటూనే చివరికి పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. అలాంటి యువ జంటలను ఇప్పటికే మనం చాలా మందిని చూశాం. అనుష్క శర్మ విరాట్ కోహ్లీ , కాజల్ గౌతమ్ అలాగే ఇటీవల పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ లావణ్య అందరూ ఇదే బాపతి అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ జంటల గురించి ఎన్ని సార్లు వార్తలు వచ్చినప్పటికీ మా మధ్య అలాంటిదేం లేదంటూ చెప్పుకొచ్చి సడన్ గా నిశ్చితార్థం , పెళ్లి అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. చివరివరకు దాగుడుమూతల ఆట ఆడిస్తూ వారి ప్రేమ వ్యవహారాలను సిని తారలు నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మరియు రీతు వర్మ ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

is-mega-hero-vaishnava-tej-rituvarma-love-story-true

ఇలా వస్తున్న వార్తలు పై వైష్ణవ తేజ్ చెబుతున్నది కూడా ఎవరు నమ్మడం లేదు.  మీరు కూడా అదే బాపతి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో చాలాకాలంగా ఈ జంట గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా వీరిద్దరిని కూడా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటతో పోలుస్తున్నారు. అయితే ఇటీవల వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి వివాహ వేడుకలకు కేవలం మెగా ఫ్యామిలీ మరియు త్రిపాఠి ఫ్యామిలీ హాజరయ్యారు. కానీ అక్కడ రీతూవర్మ కూడా కనిపించడం ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయింది. అంతేకాక పెళ్లికి ముందు అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీలో కూడా రీతూ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

is-mega-hero-vaishnava-tej-rituvarma-love-story-true

ఆమె ఆ కుటుంబానికి చెందిన ఓ హీరోతో రిలేషన్ షిప్ లో ఉండడం వల్లనే ప్రతి ఫంక్షన్ లో కనిపిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తల పై వైష్ణవి తేజ్ స్పందించారు. ఇటీవల వైష్ణవ్ నటించిన ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ వార్తలపై స్పందించడం జరిగింది. అయితే వరుణ్ లావణ్య వివాహ వేడుకల్లో రీతు పాల్గొనడానికి గల కారణం ఆమె లావణ్య కి మంచి స్నేహితురాలు …అందుకే ఆమెకు సంబంధించిన ప్రతి వేడుకలలో రీతూ ఉంది అంటూ తెలియజేశాడు. అంతకుమించి ఏం లేదంటూ వైష్ణవ్ చెప్పుకొచ్చాడు. మరి వీరి మాటలను నమ్మొచ్చ లేదా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.