Indraja : ఇష్టం లేకుండానే ఆలీ,నాగార్జునతో ఆ పనికి ఒప్పుకున్న..ఇంద్రజ షాకింగ్ కామెంట్స్..

Indraja : సినీ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రావాలన్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావాలన్నా, వచ్చిన తర్వాత అవకాశాలను వినియోగించుకోవాలన్నా చాలా అదృష్టం ఉండాలి. చేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్న కెరియర్ల ముందుకెళ్లడం చాలా కష్టం. ఇక ఇదే విషయాన్ని మరోసారి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ. ఆరోజుల్లో తాను చేసిన జీను ప్యాంటు చూసి బుల్లెమ్మ అనే పాట లో ఆమె పర్ఫామెన్స్ […]

  • Published On:
Indraja : ఇష్టం లేకుండానే ఆలీ,నాగార్జునతో ఆ పనికి ఒప్పుకున్న..ఇంద్రజ షాకింగ్ కామెంట్స్..

Indraja : సినీ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రావాలన్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావాలన్నా, వచ్చిన తర్వాత అవకాశాలను వినియోగించుకోవాలన్నా చాలా అదృష్టం ఉండాలి. చేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్న కెరియర్ల ముందుకెళ్లడం చాలా కష్టం. ఇక ఇదే విషయాన్ని మరోసారి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ. ఆరోజుల్లో తాను చేసిన జీను ప్యాంటు చూసి బుల్లెమ్మ అనే పాట లో ఆమె పర్ఫామెన్స్ ను ఎన్ని సంవత్సరాలైనా కూడా మర్చిపోలేము. ఆమె అందం, ఆమె రూపం, ఆమె నవ్వు , అబ్బో అప్పట్లో అబ్బాయిలు ఈమె అందానికి ఫిదా అయిపోయారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

స్టార్ హీరోయిన్లకు మించిపోయే అందం ఉన్నప్పటికీ ఇంద్రజకి కొన్ని ఆఫర్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. దానికి గల కారణం ఆ సమయంలో ఆమె వేసిన కొన్ని తప్పటడుగులు. తన కెరియర్ మొదలవుతున్న సమయంలో ఐటెం సాంగ్స్ చేసి తన ఫామ్ తగ్గించేసుకుంది. స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగకుండా తన కెరీర్ కు తానే బ్రేకులు వేసుకుంది. అయితే ఆ రోజుల్లో ఇంద్రజ రెండు ఐటెం సాంగ్స్ కి చేయడం జరిగింది. ఒకటి నాగార్జున సరసన కన్నే పెట్టరో పాటకు డాన్స్ చేసి అలరించిగా, ఇంకొకటి ఆలీతో జీన్స్ ప్యాంటు చూసి బుల్లమ్మ అనే పాటకు చిందులేసింది. అంతేకాక తమిళ్ లో కూడా ఒక ఐటమ్ సాంగ్ చేసినట్లు సమాచారం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాటి గురించి ఇంద్రజను అడగగా దానికి ఆమె షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చింది. నిజం చెప్పాలంటే అలాంటి సాంగ్స్ చేయాలని ఎ హీరోయిన్ కి ఉండదు కానీ పెద్ద వాళ్ళ రిక్వెస్ట్ పైన చేయాల్సి వస్తుందని, పెద్ద బ్యానర్ వాళ్ళు అడిగినప్పుడు నో చెప్తే బాగుండదు, పెద్ద బ్యానర్ కదా అని చాలామంది ఒప్పుకోవాల్సి వస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. ఆ రోజుల్లో నేను కూడా ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశానని, అయినా ఇప్పుడు వాటి గురించి ఎందుకు వాటి గురించి ఎక్కువసేపు మాట్లాడిన లేనిపోని వివాదాలు చోటు చేసుకుంటాయి. అందుకే వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పింది. అయితే సినీ ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్లు కూడా హీరోయిన్లను ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆమె చెప్పకనే చెప్పినట్లుగా అందరూ అనుకుంటున్నారు.

https://youtu.be/9aCkHdtLInI