Honey Rose : ఆ హీరోతో నాకు అలా చేయాలని ఉంది.. వీర సింహారెడ్డి హీరోయిన్ హనీ రోజ్ సంచలన కామెంట్స్..

Honey Rose : మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించిన హనీ రోజ్ ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలొ బాలకృష్ణ సరసన నటించిన తెలుగు సిని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే తాజాగా హనీ రోజ్ భాగ్యనగరంలో సందడి చేస్తుంది. హైదరాబాదులోని మదీనాగూడలో జైలు తీమ్ తో నిస్మత్ మండీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హైదరాబాదుకు రావడం చాలా సంతోషంగా ఉందని, వీర సింహారెడ్డి […]

  • Published On:
Honey Rose : ఆ హీరోతో నాకు అలా చేయాలని ఉంది.. వీర సింహారెడ్డి హీరోయిన్ హనీ రోజ్ సంచలన కామెంట్స్..

Honey Rose : మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించిన హనీ రోజ్ ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలొ బాలకృష్ణ సరసన నటించిన తెలుగు సిని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే తాజాగా హనీ రోజ్ భాగ్యనగరంలో సందడి చేస్తుంది. హైదరాబాదులోని మదీనాగూడలో జైలు తీమ్ తో నిస్మత్ మండీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హైదరాబాదుకు రావడం చాలా సంతోషంగా ఉందని, వీర సింహారెడ్డి సినిమాలో నేను చేసిన పాత్రకు సిని ఇండస్ట్రీ మరియు అభిమానుల నుంచి మంచి ప్రశంసలు లభించాయని ఆమె చెప్పింది.

i-want-to-do-that-with-that-hero-veera-simha-reddy-heroine-honey-rose-sensational-comments

i-want-to-do-that-with-that-hero-veera-simha-reddy-heroine-honey-rose-sensational-comments

బాలకృష్ణ లాంటి లెజెండ్ యాక్టర్ తో సినిమా చేసే అవకాశం నాకు లభించడం నిజంగా నా అదృష్టమని రోస్ తెలిపింది. నేను 14 ఏళ్ల వయసులోనే 2005లో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాను. ఇక ఈ సినిమాలే తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. నరసింహారెడ్డి సినిమా కోసం గోపీచంద్ మాలినేని నాకు కాల్ చేశారు . ఇక ఈ సినిమా గురించి మొత్తం వివరించారు. గోపీచంద్ మాలినేని దగ్గర నుంచి ఫోన్ రావడంతో నేను ఆశ్చర్యపోయాను. అంతేకాక ఈ సినిమాలో రెండు పాత్రలో అనిపించాల్సి వచ్చింది. ఇక ఇది నాకు కూడ అరుదైన అవకాశం అనిపించింది . ఇక దీనికోసం చాలా కష్టపడ్డాను మూవీ సమయంలో బాలకృష్ణ గారు సలహాలు సూచనలు ఇచ్చేవారని

i-want-to-do-that-with-that-hero-veera-simha-reddy-heroine-honey-rose-sensational-comments

i-want-to-do-that-with-that-hero-veera-simha-reddy-heroine-honey-rose-sensational-comments

ఆయనతో నటించడం వలన చాలా అంశాలు నేర్చుకున్నానని రోజ్ తెలియజేశారు. ఇక సోషల్ మీడియాలో మంచి చెడు వార్తలు వస్తూనే ఉంటాయి. నేను ఆ రెండిటిని బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం , కేరళ ఫుడ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. హైదరాబాదులోని బిర్యాని అన్నం పెరుగు కూడా నచ్చాయని రోజ్ చెప్పుకొచ్చింది.అంతేకాక రోజ్ కు రొమాంటిక్ పాత్రలో చేయాలని కోరికక ఉందట. రొమాంటిక్ పాత్రలు నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె తెలిపారు.