Ram Charan Party : దీపావళి వేడుకలను కలిసి జరుపుకున్న టాలీవుడ్ అగ్ర హీరోలు…

Ram Charan Party  : దీపావళి పండుగను సినీ తారలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఆదివారం రోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు దీపావళి పండుగకు చాలా గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. శనివారం రోజు హైదరాబాదులోని వారి నివాసంలో పలువురు సినీ ప్రముఖులతో ఈ వేడుకలను నిర్వహించారు. అయితే వారి కూతుర క్లింకారా కు […]

  • Published On:
Ram Charan Party : దీపావళి వేడుకలను కలిసి జరుపుకున్న టాలీవుడ్ అగ్ర హీరోలు…

Ram Charan Party  : దీపావళి పండుగను సినీ తారలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఆదివారం రోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు దీపావళి పండుగకు చాలా గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. శనివారం రోజు హైదరాబాదులోని వారి నివాసంలో పలువురు సినీ ప్రముఖులతో ఈ వేడుకలను నిర్వహించారు.

top-heroes-of-tollywood-celebrated-diwali-together

అయితే వారి కూతుర క్లింకారా కు ఇది తొలి దీపావళి పండుగ కావడంతో ఈ పార్టీని గ్రాండ్ గా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ దీపావళి వేడుకలకు స్టార్ హీరోలు వెంకటేష్ మహేష్ బాబు నమ్రత మరియు జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి దంపతులతో పాటు మంచు లక్ష్మి సుధీర్ బాబు ఫ్యామిలీ మరియు పలువురు సినీ నటులు , దర్శక నిర్మాతలు కూడా పార్టీలో పాల్గొనడం జరిగింది.

top-heroes-of-tollywood-celebrated-diwali-together

ఇక ఈ దీపావళి వేడుకలలో విందు భోజనం మరియు గేమ్స్ ఆడుతూ అందరూ చాలా సరదాగా గడిపినట్లు తెలుస్తోంది.  ఇక ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా లో షేర్ చేయగా ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. అలాగే ఒకే ఫ్రేమ్ లో నలుగురు అగ్ర హీరోలు కనిపించడంతో ఆ ఫోటో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఫోటో తేగ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)