Insta Love : ఇన్ స్టా లో ప్రేమాయణం…బజారుకెక్కిన ఆడపిల్ల జీవితం…

Insta Love : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ముక్కు మొహం తెలియని వ్యక్తులతో కూడా స్నేహాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి స్నేహాలు కొన్ని సందర్భాలలో ప్రమాదకరంగా మారుతాయి. వారు ఎలాంటి వారు అనేది పూర్తిగా తెలియకుండా స్నేహం చేస్తే ఇలాంటి పరిణామాలు తప్పవు. అయితే ఇలాంటి స్నేహాలు ప్రమాదకరం అనిపించేలా హైదరాబాదులో ఓ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాదులోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే హైదరాబాదులో ఉండే ఓ యువతకి ఇన్ స్టా […]

  • Published On:
Insta Love : ఇన్ స్టా లో ప్రేమాయణం…బజారుకెక్కిన ఆడపిల్ల జీవితం…

Insta Love : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ముక్కు మొహం తెలియని వ్యక్తులతో కూడా స్నేహాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి స్నేహాలు కొన్ని సందర్భాలలో ప్రమాదకరంగా మారుతాయి. వారు ఎలాంటి వారు అనేది పూర్తిగా తెలియకుండా స్నేహం చేస్తే ఇలాంటి పరిణామాలు తప్పవు. అయితే ఇలాంటి స్నేహాలు ప్రమాదకరం అనిపించేలా హైదరాబాదులో ఓ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాదులోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే హైదరాబాదులో ఉండే ఓ యువతకి ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఓ తమిళ యువకుడు పరిచయం అయ్యాడు. కొన్నాళ్ల వారి స్నేహం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో యువతి కుర్రాడి ఆర్థిక అవసరాల కోసం చేయకూడని పని చేసి చిక్కుల్లో ఇరుక్కుంది.

హైదరాబాద్ మహానగరంలోని బొల్లారం ప్రాంతానికి చెందిన ఓ యువతీ …నారాయణగూడ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ దానికి సమీపంలో గల కళాశాలలో ఎంబీఏ చదువుతుంది. ఏడు నెలల క్రితం ఆమెకు ఇంస్టాగ్రామ్ వేదికగా చెన్నైకి చెందిన పూర్ణేష్ యాదవ్ అనే కుర్రాడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని పూర్ణేష్ ఆ యువతకి మాట ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం పూర్ణేష్ యువతకి ఫోన్ చేసి తనకి అర్జెంటుగా డబ్బులు కావాలని, నీ దగ్గర లేకపోతే స్నేహితుల వద్ద అడిగి తీసుకోమని ఒత్తిడి చేసాడు.

దీంతో యువతి తన స్నేహితుడు అస్లామ్ ను సంప్రదించండి. అస్లామ్ కూడా తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో…మరో స్నేహితుడు సాయిచరణ్ సాయం అడిగింది. దీనిని అణువుగా తీసుకున్న సాయిచరణ్ ఆమెను తనతో ఒక రాత్రి గడపాల్సిందిగా కోరాడు. దీనికి యువతీ కూడా అంగీకరించింది. దీంతో గత నెల 23న నారాయణగూడ విటల్ వాడిలో ఉన్న హోటల్లో వీరిద్దరూ కలుసుకున్నారు. అయితే ఆ యువతిని సాయిచరణ్ తన స్నేహితుడు అస్లామ్ ద్వారా రూమ్ కి రప్పించుకున్నాడు.

ఈ క్రమంలో అస్లామ్ ఆమె న్యూడ్ గా ఉన్న దృశ్యాలను ఫోన్ లో వీడియో తీశాడు. అనంతరం యువతీకి ఆ వీడియోలను పంపించి తనతో కూడా అలా గడిపితేనే వీడియోలు డిలీట్ చేస్తానంటూ బెదిరించసాగాడు. దీనికి యువతి ఒప్పుకోకపోవడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ పూర్ణేష్ కు ఈ వీడియోస్ పంపించాడు. ఇక ఈ వీడియో చూసిన పూర్ణేష్ కూడా ఆమెను బెదిరించసాగాడు . దీంతో చేసేది ఏమీ లేక బాధితురాలు షీ టీమ్స్ ను ఆశ్రయించి ముగ్గురిపై ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులు ముగ్గురు కుర్రాళ్లపై కేసు నమోదు చేసి అస్లామ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తీసుకెళ్లారు.