Srileela : వాళ్లు బెదిరించడం వల్లనే బాలయ్య సినిమాలో చేయడానికి ఒప్పుకున్నా.. శ్రీలీల సంచలన వ్యాఖ్యలు..

Srileela : శ్రీ లీల… ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. అయితే శ్రీలీల మొదటిగా 2019 లో “కిస్” అనే కన్నడ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఇక ఈ సినిమాలో బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత “పెళ్లి సందడి” అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవడంతో శ్రీలీల లైఫ్ టర్న్ అయిందని చెప్పాలి. పెళ్లి సందడి […]

  • Published On:
Srileela : వాళ్లు బెదిరించడం వల్లనే బాలయ్య సినిమాలో చేయడానికి ఒప్పుకున్నా.. శ్రీలీల సంచలన వ్యాఖ్యలు..

Srileela : శ్రీ లీల… ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. అయితే శ్రీలీల మొదటిగా 2019 లో “కిస్” అనే కన్నడ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఇక ఈ సినిమాలో బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత “పెళ్లి సందడి” అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవడంతో శ్రీలీల లైఫ్ టర్న్ అయిందని చెప్పాలి. పెళ్లి సందడి సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. శ్రీలీల చేసిన ప్రతి సినిమా హిట్ అవడంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవల స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజతో ధమాకా మూవీలో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది.

 

అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ లకు పోటీ ఇస్తుంది. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ #NBK108 సినిమాలో శ్రీ లీల కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గాడ్ ఆఫ్ మాసస్ బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న బాలకృష్ణ తర్వాత సినిమాలో శ్రీ లీల ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని మూవీ యూనిట్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే. 1990 స్ హీరో అయినప్పటికీ ఇప్పటికీ బాలకృష్ణ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి.

ఈ తరం హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ ఒక్కరే అని చెప్పాలి. ఇప్పటికే “అఖండ” “వీర సింహారెడ్డి” వంటి భారీ హీట్ లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమాలో నటించనున్నారు. ఇక ఈ సినిమాలో వరస హిట్ లతో దూసుకుపోతున్న శ్రీ లీల ఉండడం విశేషం. ఇక ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో శ్రీ లీల బాలకృష్ణ చేయి పట్టుకుని క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. దీంతో ఈ పోస్టర్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది.